Begin typing your search above and press return to search.
అగ్నిపథ్ ఉన్న దేశాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
By: Tupaki Desk | 21 Jun 2022 1:30 AM GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'అగ్నిపథ్'పై ఆగ్రహ జ్వాలాలు ఇంకా చల్లారలేదు. ఈ పథకం తమకు తీరని అన్యాయం చేస్తోందని సైనిక అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ పథకం ద్వారానే నియామకాలు జరుగుతాయని తేల్చి చెప్పింది. అయితే ఈ పథకం వల్ల ఎలాంటి నష్టం లేదని, ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ ప్రతినిధులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలుదేశాల్లో ఈ విధంగానే సైనిక నియామకాలు చేపడుతున్నాయని చెబుతున్నారు. అక్కడ ఈ విధానంతో సక్సెస్ అయ్యాయని కూడా పేర్కొంటున్నారు. అయితే అగ్నిపథ్ లాగే ఏయే దేశాల్లో సైనికులను నియమించుకుంటున్నారు..? వారు అనుసరిస్తున్న విధానాలేంటి..?
దక్షిణ కొరియాలో సైనిక వ్యవస్థ బలంగా ఉంది. ఇక్కడ సైన్యంలో చేరేవారు 21 నెలల పాటు ఆర్మీలో, 23 నెలల పాటు నౌకాదళంలో, 24 నెలల పాటు వైమానిక దళంలో తప్పనిసరిగా పనిచేయాలి. అయితే ఒలంపిక్స్, ఏయిషన్ గేమ్స్ లో బంగారు పతకాలు సాధించిన వారికి సడలింపు ఉంటుంది. అలాగే వీరు పోసలీస్, కోస్ట్ గార్డ్స్, ఫైర్ సర్వీసుల్లో కూడా చేయొచ్చు.
ఉత్తరకొరియాలోని ప్రతి పౌరుడు దేశ సైన్యంలో పనిచేయాలి. పురుషులు 11 సంవత్సరాలు.. మహిళలు 7 సంవత్సరాలు పనిచేయాలి.
ఇజ్రాయిల్ దేశంలో పుషులతో పాటు ప్రతి మహిళ తప్పనిసరిగా సైనిక శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. పురుషులు మూడేళ్లు పనిచేస్తారు. మహిళలు రెండేళ్లు చేస్తారు. స్వదేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నవారికి ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే కొత్తగా వలస వచ్చిన వాళ్లు, ఇతర మతాలకు చెందినవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సడలింపు ఉంటుంది.
స్విట్జర్లాండ్ లో 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు సైన్యంలో తప్పనిసరిగా పనిచేయాలి. అయితే తప్పనిసరి అనే నిబంధన 21 వారాలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత అవసరాన్ని భట్టి శిక్షణ తీసుకుంటారు. ఇక్కడ మహిళలకు ఆ నిబంధన లేదు.
ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలోనూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి. పురుషులు, మహిళలు ఎవరైనా 18 నెలల పాటు శిక్షణ తీసుకోవాలి. అయితే ఈ కాలాన్ని నిత్యం పొడగిస్తూ ఉంటారని మానవ హక్కుల సంస్థలు అంటున్నాయి. ఇలాంటి నిర్ణయంతో దేశంలోని యువత సైన్యంలో చేరేందుకు ముందుకు రావడం లేదు.
సిరియాలోనూ పురుషులు సైన్యంలో పనిచేయడం తప్పనిసరి. అయితే గతంలో 21 నెలల పాటు ఉండే కాలాన్ని 18 నెలలకు కుదించారు. ఈ మేరకు 2011లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు చేసేవారు తప్పనిసరిగా సైన్యంలో పనిచేసి ఉండాలి.
బ్రెజిల్ దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతీ పురుషుడు సైన్యంలో చేరాలి. ఇక్కడ 10 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఆరోగయ కారణాల ప్రాతిపదికన ఈ సర్వీసు నుంచి మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ సర్వీసులో సైనికులకు తక్కువ జీతం, స్వల్ప ఆహారం, బ్యారక్ లో బస లబిస్తుంది.
స్వీడన్ దేశంలో 100 ఏళ్లపాటు అమలులో ఉన్న నిర్బంధ సైనిక సర్వీసు నిబంధనను 2010లో రద్దు చేశారు. అయితే 2018 నుంచి 4 వేల మంది స్త్రీ, పురుషులను తప్పనిసరిగా సైనిక స్వీసులోకి తీసుకోవాలని నిర్ణయించింది.
టర్కీలో 20 ఏళ్లు దాటిని పురుషులందరూ 6 నెలల నుంచి 15 నెలల వరకూ తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి. గ్రీస్ లో 19 ఏళ్ల యువకులు 9 నెలల పాటు సైన్యంలో పనిచేయాలి ఇరాన్లో 18 ఏళ్లు పైబడిన పురుషులు 24 నెలల పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి క్యూబాలో 17 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు రెండేళ్ల పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి.