Begin typing your search above and press return to search.
నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా : మంత్రి కేటీఆర్!
By: Tupaki Desk | 12 May 2020 11:10 AM GMTసోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరి పని వారు చూసుకోవడం చాలామంది ఎప్పుడో మర్చిపోయారు. ఎప్పుడు ఏ తప్పుడు వార్త వస్తుందా ..ఆ వార్తను ఎప్పుడు వైరల్ చేద్దామా అని ఎదురుచూసేవారు ఈ రోజుల్లో సర్వ సాధారణమైపోయారు. ముఖ్యంగా రాజకీయనేతలు టార్గెట్ చేయడం , వారి ఆరోగ్యం పై వందంతులు సృష్టించడం ప్రస్తుతం కొందరికి అలవాటుగా మారి పోయింది.
ఈ తరుణంలో తన ఆరోగ్యం పై సోషల్ మీడియాలో వస్తున్న వందంతులపై మంత్రి కేటీఆర్. తాను కొన్నేళ్లుగా జలుబుతో కూడిన అలర్జీతో బాధపడుతున్నానని... ఇటీవల సిరిసిల్ల పర్యటన సందర్భంగా అలాంటి జలుబు కారణంగానే కొంత ఇబ్బంది పడ్డానని ఆయన వివరించారు. అయితే హఠాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుంటే... కొందరు ఇబ్బంది పడతారనే కారణంగానే జలుబుతోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని .. తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతొక్కరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహమ్మారి పై జరుగుతున్న పోరులో మీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని... మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ అనేక మంది ట్విట్ చేశారు. వారి ట్వీట్స్‌కు సంబంధించిన మంత్రి కేటీఆర్...ఈ విధంగా వివరణ ఇచ్చారు.