Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో కరోనా పుకార్లు నమ్మొచ్చా?

By:  Tupaki Desk   |   27 March 2020 2:30 AM GMT
సోషల్ మీడియాలో కరోనా పుకార్లు నమ్మొచ్చా?
X
కరోనా పేరు చెబితేనే ప్రపంచం గజగజ వణికిపోతుంది. చైనాలోని వుహాన్ లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం అన్ని దేశాలకు పాకింది. కరోనాపై ఆయా దేశాలు అవగాహన కల్పిస్తున్నాయి. అయితే ఈ మహమ్మరిపై వస్తున్న పుకార్లు ప్రజలను మరింత గందరగోళనాకి గురి చేస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డబ్ల్యూహెచ్ ఓ ముందుకొచ్చింది. దీనిలో భాగంగా కరోనాపై అపోహలను తొలగించడానికి సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది.

*సోషల్ మీడియాలో కరోనాపై వస్తున్న పుకార్లు..

భారత్ లాంటి ఉష్టోగ్రతలు ఎక్కువగా దేశాల్లో కరోనా ప్రభావం అంతగా ఉండదని ప్రచారం జరుగుతోంది. భారత్లో వచ్చే రెండు నెలలు ఎండలు ఎక్కువగా ఉంటాయి కావున కరోనాపై ఆందోళన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించింది. ఇప్పటికే ఉష్ణమండల ప్రాంతాలైన సింగపూర్‌ - ఆస్ట్రేలియాల్లోనూ కరోనా వ్యాపించిందని పేర్కొంటుంది. వేడి వాతావరణంలో కరోనా రాదనుకోవడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వెల్లడించింది. సార్స్‌ - ఇతర వైరస్‌ లతో కరోనాను పోల్చకూడదని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది.

*పిల్లలకు కరోనా రాదనేది అపోహ మాత్రమే..

కరోనా వయోజనుల్లో వస్తుందని పిల్లల్లో రాదనేది అపోహ మాత్రమేనని డబ్ల్యూహెచ్ ఓ స్పష్టం చేసింది. కరోనాకు వయస్సుతో సంబంధంలేదని ఇది ఎవరికైనా సోకే ప్రమాదం ఉందని పేర్కొంది.

*ఎక్కువగా నీళ్లు తాగితే కరోనా రాదా

ఎక్కువగా నీళ్లు తాగితే వైరస్‌ గొంతులో నుంచి కడుపులోకి పోతుందని.. ఆ తర్వాత కడుపులో యాసిడ్‌ ల వల్ల కరోనా చనిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిలోనూ ఎంతమాత్రం వాస్తవం లేదని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది. ఇది అపోహ మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఎక్కువగా నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌ రాకుండా చూసుకవడం మంచిదేనని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది.

*ప్రాథమిక దశలో లేకపోతే లేనట్టేనా?

కరోనా సోకిందో లేదోనని తెలుసుకునేందుకు ప్రాథమిక దశలో థర్మల్‌ స్కానర్‌ ఉపయోగిస్తున్నారు. వీటిని ఎక్కువగా ఎయిర్ పోర్టు - రైల్వే స్టేషన్లలో వాడుతున్నారు. అయితే కరోనా సోకిన వ్యక్తి లక్షణాలు వెంటనే బయటపడక పోవచ్చు. దీంతో థర్మల్‌ స్కానర్‌ లో సాధారణ ఉష్ణోగ్రతే నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీంతో అతడికి కరోనా సోకలేదని అనుకుంటారు. కానీ వ్యాధి ఉంటే ఆ రెండు నుంచి పదిరోజుల్లో ఎప్పుడైనా బయటపడొచ్చని డబ్ల్యూహెచ్ ఓ స్పష్టం చేసింది.

*గట్టిగా పది సెకన్లు గాలి పీల్చగలిగితే కరోనా లేనట్టా?

గట్టిగా పది నిమిషాలు గాలిపిస్తే కరోనా లేనట్టేనని జరుగుతుందని ఇది పూర్తిగా అవాస్తమని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంది. ఆన్‌లైన్లో ఇలాంటి టెస్ట్‌ లు ప్రచారంలో ఉన్నాయని పేర్కొంది. కరోనా/ కోవిడ్‌ చెకప్ పేరుతో వెబ్‌ సైట్లలో వీటిని పెడుతున్నారని వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొంది. ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తే వైద్యులను సంప్రదించాల్సిందే డబ్ల్యూహెచ్ ఓ స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని డబ్ల్యూహెచ్ ఓ చెబుతుంది. ఎవరికీ వారు స్వీయనియంత్రణ పాటిస్తే కరోనాకు దూరంగా ఉండొచ్చని పేర్కొంది. మనం ఆహ్వానిస్తే తప్ప కరోనా రాదని కోరికోరి కరోనా తెచ్చుకోవద్దని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిస్తుంది.