Begin typing your search above and press return to search.
బొండా ఉమా వెళ్లిపోతున్నాడా..టీడీపీ పొగ పెడుతోందా..!
By: Tupaki Desk | 1 Aug 2019 11:08 AM GMTఏపీ రాజధాని కేంద్రమైన విజయవాడలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు టిడిపిని వీడి వైసీపీలోకి వెళ్లిపోతున్నారన్న వార్త హల్‌చల్ చేస్తోంది. 2014 లో టిడిపి నుంచి సెంట్రల్ ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్లపాటు రాష్ట్రస్థాయి నేతగా ఓ రేంజ్ లో హల్ చల్ చేశారు. టిడిపి తరఫున బలమైన వాయిస్ వినిపించే నేతగా మీడియాలో ప్రాచుర్యం పొందారు. చివరకు తనకు మంత్రి పదవి రాలేదని నేరుగా చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుని మాట్లాడారు. చంద్రబాబు కాపుల గొంతుకోశారు అంటూ తీవ్రంగా విమర్శించారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచే బోండా పార్టీ మారిపోతారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన్ను అక్కడ టిడిపి ఎన్నారైలు ఓ సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానించారు. బొండా ఆ సమావేశానికి వెళ్లేందుకు నిరాకరించడంతో టిడిపి ఎన్నారైలు అందరూ షాక్ అయిపోయారు. ఇక బొండా ప్రవర్తనతో తెలుగుదేశం అధిష్టానం ముందుగానే అలెర్ట్ అయ్యింది. ఆయన పార్టీ మారిపోతే సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు ? సమర్థులైన నాయకులు ఉన్నారని నేరుగా కార్పొరేటర్లకు ఫోన్ చేసి ఆరాలు కూడా తీసింది. ఇది కూడా బొండా దృష్టికి చేరడంతో అధిష్టానంపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
రాధా వైసిపి వీడి టిడిపిలోకి వెళ్లి పోవడంతో ఇప్పుడు వైసిపికి విజయవాడలో ఓ బలమైన కాపు నేత అవసరం ఉంది. పార్టీలోకి బొండా వస్తే ఎలాంటి షరతులు లేకుండా ఓకే చెప్పాలన్న ఆలోచనలో వైసీపీ ఉందట. బొండా మాస్ లో పట్టున్న నేత.... ఆయన వస్తే తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కూడా వైసీపీ ఉందని తెలుస్తోంది. బొండా సొంత నియోజకవర్గమైన సెంట్రల్ లో మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఆయన వేలు పెట్టేందుకు ఛాన్స్ ఉండదు. తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం గత ఎన్నికల్లో ఓడినా బొప్పన భావకుమార్ తో పాటు... మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి గ్రూపులు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు బొండాకు తూర్పు బాధ్యతలు అప్పగిస్తే అక్కడ ఎంతవరకు నెట్టుకు వస్తారు ? అన్నది సందేహమే. గతంలో వంగవీటి రాధాని కూడా వైసిపి తూర్పు నుంచి పోటీ చేయించినా... ఆ ప్రయోగం బెడిసికొట్టింది. ఇక టిడిపి కూడా బొండా పార్టీలో ఉన్నా పోయినా ఒకటే అన్నట్టుగానే వ్యవహరిస్తోందట. అందుకే ఆయన్ను పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయ్. అందుకే అక్కడ కార్పొరేటర్లకు - పార్టీ నేతలకు ఫోన్లు వెళ్లి మీరు మరో నేతను రెడీ చేసుకొమ్మని చెప్పేస్తున్నారట. ఇక బొండా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వెంటనే పార్టీ మారతాడా ? లేదా ? అన్నది క్లారిటీ వస్తుంది.