Begin typing your search above and press return to search.
బ్యాడ్ లక్ అంటే మయాంక్ దే.. నో బాల్ కు రనౌట్.. అదీ టెస్టుల్లో..
By: Tupaki Desk | 12 March 2022 3:30 PM GMTటీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో బ్యాడ్ లక్ , గుడ్ లక్ దోబూచులాడుతున్నాయి. అతడికి గుడ్ లక్ ఎంత ఉందో బ్యాడూ అంతే ఉందని అనిపిస్తోంది. రంజీల్లో పరుగుల వరద పారించినా.. ఓ దశలో టీమిండియాలో చోటే దక్కని పరిస్థితి. ఎలాగూ కాలం కలిసి వచ్చి.. యువ ఓపెనర్ ప`థ్వీ షా అనూహ్యంగా గాయపడడంతో టీమిండియా పిలుపు దక్కింది మయాంక్ కు. ఇది జరిగింది 2018-19 ఆస్ట్రేలియా సిరీస్ లో. కంగారూ గడ్డపై తన ప్రతిభ చాటుకున్న మయాంక్ జట్టులో చోటు స్థిరం చేసుకునేలానే కనిపించాడు. మధ్యలో కొన్ని మంచి, భారీ ఇన్నింగ్స్ లూ ఆడాడు.
అయితే, అవి కెరీర్ కు ఉపయోగపడినవా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. జట్టులో చోటుకు యువకుడు శుభ్ మన్ గిల్, మయాంక్ చిరకాల మిత్రడు కేఎల్ రాహుల్ నుంచి తీవ్ర పోటీ ఉండడమే దీనికి కారణం.
దోబూచులాట అంటే ఇదే.. అందీ అందక, చిక్కీ చిక్కక చేజారడాన్ని దోబూచులాట అంటారు. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ కూ అదే పరిస్థితి ఎదురైంది. తనకు ఎంతో అనుభవం ఉన్న, ఎంతగానో అభిమానించే.. సొంతగడ్డ బెంగళూరులో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మయాంక్ చిత్రంగా ఔటయ్యాడు.
మొహాలీ లో జరిగిన తొలి టెస్టులో మయాంక్ ఇన్నింగ్స్ ను మంచిగానే ప్రారంభించినా.. 40ల్లోనే ఔటయ్యాడు. దీనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. మయాంక్ కు చురకలేశాడు. నీ స్థానం అంత పదిలం కాదు చూసుకో? అని హెచ్చరించాడు.
దీని సంగతి పక్కన పెడితే.. రనౌట్.. అదీ టెస్టుల్లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మయాంక్ రనౌటయ్యాడు. అది కూడా నోబాల్ కు. అన్నింటికి మించి టెస్టుల్లో రనౌట్ అనేది కొంత హాస్యాస్పదం గా ఉంటుంది. కానీ, లక్ బాగోలేనప్పుడు ఏదైనా జరగొచ్చు అనేందుకు ఇదో ఉదాహరణ.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన మయాంక్ ఆశావహంగా కనిపించాడు. మంచి స్కోరు చేసేంత టచ్ లోనూ ఉన్నాడు. కానీ, అనూహ్యంగా నిష్ర్కమించాడు. ఎడమ చేతి వాటం పేసర్ జయవిక్రమ వికెట్లకు సూటిగా వేసిన బంతి మయాంక్ ప్యాడ్లకు తగిలింది. వాస్తవానికి ఇది ఎల్బీలా కనిపించింది. ఇందుకోసం జయవిక్రమ అప్పీలు కూడా చేశాడు. అయితే, ఈలోగా విచిత్రం జరిగింది. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోని కెప్టెన్ రోహిత్ నుంచి పరుగు కోసం పిలుపురావడంతో మయాంక్ లేని పరుగుకు ప్రయత్నించాడు. కానీ, రోహిత్ క్రీజు నుంచి కొద్దిగా ముందుకొచ్చి వెనక్కువెళ్లిపోయాడు.
దీనిని గమనించని మయాంక్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వచ్చేశాడు. ఈ లోగా షార్ట్ కవర్ డ్రైవ్ నుంచి ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్ డిక్ వెల్లాకు అందించడం అతడు వికెట్లను గిరాటేయడం జరిగిపోయింది. కాగా, అంపైర్ జయవిక్రమ బంతిని ఫ్రంట్ ఫుట్ నోబాల్ గా ప్రకటించాడు. ఈ లెక్కన మయాంక్ ఎల్బీ అయినా ఔటయ్యేందుకు అవకాశం లేకపోయేది. కానీ, రనౌట్ కావడంతో చేసేదేమీ లేకపోయింది. అలా.. అతడిని బ్యాడ్ లక్ వెంటాడింది. అదికూడా టెస్టులో.. నోబాల్ కు.. రనౌట్ రూపంలో..? ఎంత చిత్రం ఇది..?