Begin typing your search above and press return to search.
అక్కడ అంతే; బాధితులకు సాయాన్ని ఊరుకోరు
By: Tupaki Desk | 3 Aug 2015 4:55 AM GMTపశ్చిమబెంగాల్ లో రాజకీయాలు ఓ రేంజ్ లో ఉంటాయి అగ్రస్థానంలో ఉన్న వారే కానీ.. వార్డు స్థాయిలోనూ పార్టీల మధ్య విబేధాలు భారీగా ఉంటాయి. తమకు పట్టున్న ప్రాంతాల్లోకి మరోపార్టీ నేతల్ని రావటాన్ని ససేమిరా అంటారు. అది కూడా ఏ స్థాయిలో అంటే.. విపత్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. తమను ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే సమయంలో అయినా.. సాయంగా ఎవరైనా రావటంపై కన్నెర్ర చేస్తారు.
తాజాగా ఇలాంటి చేదు అనుభవం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. దశాబ్దాల కిందట.. అంటే..బ్లాక్ అండ్ వైట్.. కలర్ టీవీల స్టార్టింగ్ జమానాలో మహాభారతం అనే మహా సీరియల్ ఒకటి టెలికాస్ట్ అయ్యేది. అందులో ద్రౌపతి పాత్ర పోషించి రూపా గంగూలీ.. తదనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె బీజేపీకి నేతృత్వం వహిస్తున్నారు.
గత రెండు రోజులుగా విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాలతో బెంగాల్ తదితర రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లా హబ్రా అశోక్ నగర్ వరదలతో పోటెత్తుతోంది. ఇక్కడి బాధితులకు అవసరమైన అత్యవసర సామాగ్రిని ఇచ్చేందుకు రూపా గంగూలీ రెఢీ అయ్యారు.
వాటిని తీసుకొని వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. సాయం చేయటానికి వెళ్లిన ఆమెను.. అక్కడి అధికారపక్షానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు అవమానకరంగా మాట్లాడటమే కాదు.. ఆమె సాయం ఏమీ అక్కర్లేదంటూ వెనక్కి పంపారు. దీంతో ఆమె భిన్నురాలయ్యారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీజేపీకి చెందిన రూపా గంగూలీకి జరిగిన అన్యాయంపై అక్కడి విపక్షమైన కమ్యూనిస్టు పార్టీలు గంగూలీకి అండగా నిలిచారు. ప్రభుత్వానికే కాదు.. మనసున్న ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చని చెబుతూ.. ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ అపర ద్రౌపతికి.. కమ్యూనిస్టు కృష్ణులు అండగా నిలవటం కాస్తంత విశేషమే అని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.