Begin typing your search above and press return to search.

రూపాయి ఢమాల్ !

By:  Tupaki Desk   |   7 Oct 2022 11:30 PM GMT
రూపాయి ఢమాల్ !
X
రూపాయి విలువ మరింత పతనం అయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపు ఆందోళనలతో డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.30 కి పడిపోయింది. ఇదే చరిత్రలో కనిష్ట స్థాయి. రూపాయి గత సెషన్‌లో 81.88 నుండి 82.2675 వద్ద చివరిగా ట్రేడయింది. వుతోంది, అయితే సెషన్ కనిష్ట స్థాయి 82.33 వద్ద ఉంది.

దీనికి కారణాలు అనేకం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ప్రతికూల భౌగోళిక-రాజకీయ పరిస్థితుల మధ్య ఈ ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంక్ గురువారం తగ్గించిన ఒక రోజు తర్వాత రూపాయిలో ఆల్ టైమ్ లో నమోదైంది. అంతేగాకుండా యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం మరియు ముడి చమురు ధరల పెరుగుదల కూడా మరో ప్రధాన కారణం.

మోడీ అధికారంలోకి రాక ముందు రూపాయి విలువ గురించి, పెట్రోలు ధరల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కానీ కాంగ్రెస్ హయాంలోనే రూపాయి విలువ మెరుగ్గా ఉంది. మోడీ వచ్చాక ఇంధన ధరలే కాదు అన్ని ధరలు పెరిగాయి. మధ్యతరగతి వాడి జీవనం కష్టమైపోయింది. పోనీ దేశమైనా బాగు చేశారా అంటే అదీ లేదు.

త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రెసిషన్ రానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొంటోంది. మరో 5 నెలల్లో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ముంచెత్తనుందని చెబుతున్నారు. పరిస్తితులు కూడా అలాగే ఉన్నాయి. ఇదే పతనం కొనసాగితే డాలర్ విలువ మరింత పెరిగి రూపాయి మరింత పడిపోనుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.