Begin typing your search above and press return to search.

2019 నాటి కనిష్టానికి రూపాయి ... వరుస సెషన్స్ లో పతనం !

By:  Tupaki Desk   |   12 April 2021 10:40 AM GMT
2019 నాటి కనిష్టానికి రూపాయి ... వరుస సెషన్స్ లో పతనం !
X
రూపాయి పడిపోతూనే వస్తోంది. గతవారం ఏకంగా ఆల్‌ టైమ్ రికార్డ్ స్థాయికి పతనమైంది. డాలర్ మారకంతో ఏకంగా 75స్థాయికి చేరింది. శుక్రవారం మరో 15 పైసలు పతనమై 74.73కి క్షీణించింది. దానికంటే ముందు సెషన్ ‌లో రూ.74.60 వద్ద క్లోజ్ అయింది. ఇది నవంబర్ 4, 2019 నాటి స్థాయి కావడం గమనార్హం. దానికంటే ముందు నాలుగు సెషన్లలోనూ వరుసగా రూపాయి నష్టపోయింది. మొత్తంగా ఐదు సెషన్ ‌లలో డాలర్ మారకంతో 161 పైసలు తగ్గింది. ఇక గతవారం బుధవారం ఒక్కరోజే 105 పైసలు దిగజారింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. గ్రోత్ డిఫరెన్షియల్, ఇన్‌ ఫ్లేషన్ డిఫరెన్షియల్, ఇంటరెస్ట్ డిఫరెన్షియల్ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ఈ మధ్య కాలంలో రూపాయి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. అలాగే వరుసగా ఐదు సెషన్లు నష్టపోయింది.

అమెరికా డాలర్ ‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణతకు ప్రధాన కారణం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటం. స్టాక్ మార్కెట్ల నష్టాలు, డాలర్ పట్ల ఇన్వెస్టర్ల మక్కువ కూడా కారణం అని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తమ పాలసీలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం రూపాయిని ఒత్తిడి లోకి నెట్టిందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనం దేశీయ దిగుమతులను భారంగా చేస్తుంది. ముఖ్యంగా ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. దేశీయ చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారా తీరుతోంది. రూపాయి ఇలా పతనమైతే ద్రవ్యోల్భణానికి దారి తీయవచ్చు. ఆయా వస్తు ఉత్పత్తుల ముడి సరుకుల దిగుమతులు ఖరీదు కావడం మరో కారణం. ఐటీ ఎగుమతులకు రూపాయి బలహీనత కలిసి వస్తుంది.