Begin typing your search above and press return to search.
రూపాయి పతనం అసలు కారణం అదేనన్న స్వామి
By: Tupaki Desk | 24 Sep 2018 5:44 AM GMTసంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి. ఒకసారి ఫిక్స్ అయితే నా మాటే నేను వినను అన్నట్లుగా.. ఏదైనా విషయంపై మాట్లాడాల్సి వస్తే.. స్వపక్షమా? విపక్షమా? అన్న తేడా లేకుండా కడిగి పారేస్తుంటారు. తన పార్టీ.. తనకున్న పరిమితుల్ని పట్టించుకోకుండా పార్టీ అధినేతను సైతం తప్పు పట్టే తీరు సుబ్రమణ్య స్వామి సొంతం.
తాజాగా ఆయన రూపాయి పతనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ప్రధాని మోడీ చేతకానితనం బయట పడే అవకాశం ఉన్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పేందుకు మొహమాటపడలేదు. ఈ మధ్యన అదే పనిగా రూపాయి పతనం వెనుక అసలు కారణం ఏమిటన్న విషయంపై ఆయన మాట్లాడుతూ.. దేశంలో పేరుకుపోయిన నల్లధనమే రూపాయి పతనానికి కారణంగా చెబుతున్నారు.
దేశంలో పేరుకున్న బ్లాక్ మనీ విదేశాలకు తరలిపోతోందని.. ఈ కారణంగానే డాలరుతో రూపాయి విలువ పతనం అవుతుందని స్వామి చెప్పారు. మరోవైపు అమెరికా అభివృద్ధి చెందిన దేశం కావటంతో డాలరు విలువ పెరుగుతోందని.. రూపాయి పతనంపై మోడీ సర్కారు తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పటం చూస్తే.. రూపాయి బక్కచిక్కిపోవటం వెనుక మోడీ మాష్టారి వైఫల్యాన్ని స్వామి చెప్పకనే చెప్పారని చెప్పక తప్పదు. మోడీ లాంటి నేత చేతకానితనాన్ని ఓపెన్ గా చెప్పే సాహసం కమలనాథుల్లో స్వామికి మాత్రమే సాధ్యమేమో?