Begin typing your search above and press return to search.
రూ'పాయే'
By: Tupaki Desk | 27 Nov 2015 8:46 AM GMTరూపాయి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. మోడీ ప్రధానయ్యాక రూపాయి బాహుబలిలా మారుతుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ, అలా కాకపోగా రోగిష్టిలా మారిపోయి రోజురోజుకీ దిగజారుతోంది. తాజాగా రూపాయి విలువ గత రెండేళ్లలో అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఒక డాలరుకు మారకం విలువ 66.89 రూపాయలైంది. గత రెండేళ్లలో ఇదే అతి తక్కువ విలువ.
అయితే... రూపాయి మారక విలువ పడిపోవడానికి కారణం ప్రభుత్వం కాదని, ప్రజలేనని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ విధానాల్లో లోపాల వల్ల రూపాయి పడిపోలేదని.. అమెరికన్ డాలర్ కోసం కరెన్సీ మార్కెట్ లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రూపాయి వేల్యూ సడెన్ గా కొలాప్సయిందంటున్నారు. ఒక్క డాలరుతోనే కాదు... ఈ దెబ్బకు ఇతర దేశాల కరెన్సీలతోనూ రూపాయి విలువ పడిపోయింది.
ఈ పరిస్థితుల్లో కరెక్షన్ రావాలంటే రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించాలని... సోమవారం నాటికి రూపాయి విలువ డాలరుతో 68కి పడిపోయి దారుణ పరిస్థితులు ఏర్పడొచ్చని అంటున్నారు.
కాగా.... రూపాయి విలువ పడిపోయి కేంద్రం, ఆర్ బీఐ తల పట్టుకుంటుంటే ఎన్నారైలు మాత్రం చంకలు గుద్దుకుంటున్నారట. అక్కడి నుంచి వెంటనే ఇండియాకు డబ్బు పంపించడం ప్రారంభించారట. అంతేకాదు.. రెమిటెన్స్ మార్కెట్ లోనూ ఆఫర్లు పెంచి అక్కడి నుంచి డాలర్లు పంపించడానికి ప్రోత్సాహం అందిస్తున్నారట.