Begin typing your search above and press return to search.

ఆల్ టైం కనిష్టానికి రూపాయి..డాలర్ @ రూ.76.53

By:  Tupaki Desk   |   21 April 2020 11:50 AM GMT
ఆల్ టైం కనిష్టానికి రూపాయి..డాలర్ @ రూ.76.53
X
దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. మంగళవారం ఆరంభంలో 76.79 వద్ద బలహీనపడిన రూపాయి. ఆ తరువాత డాలరు మారకంలో 30 పైసలు తగ్గి 76.83 కు చేరుకుంది. ముడి చమురు రికార్డు పతనం - దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు వెయ్యి పాయింట్లు కుప్పకూలడంతో రూపాయి మరోసారి భారీగా నష్టపోతోంది. సోమవారం అమెరికా డాలర్‌ తో పోలిస్తే రూపాయి 76.53 వద్ద స్థిరపడింది.

మరోవైపు డాలరు 100 స్థాయి మార్కును దాటేయడం తో పెట్టుబడి దారులు రూపాయిలో అమ్మకాలకు దిగారని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగి 100.15 కు చేరుకుంది. చరిత్రలో మొదటిసారిగా యుఎస్ ముడి ఫ్యూచర్స్ మైనస్ లోకి పడిపోయింది. చమురు డిమాండ్ పతనం - కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ను దెబ్బ తీస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ చెప్పుకొచ్చింది.

డబ్ల్యుటిఐ ముడి చమురు ఫ్యూచర్స్ రికార్డు పతనాన్ని నమోదు చేయగా - బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.78 శాతం పడిపోయి బ్యారెల్ కు 25.37 డాలర్లకు చేరుకుంది. అలాగే కరోనా కేసులు గణనీయంగా పెరగడం ఆర్థిక వ్యవస్థ పై భారం పడుతుందనే ఆందోళన పెరిగి పోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 24.81 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా భారతదేశం లో ఇప్పటి వరకు దాదాపు 18,600 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.