Begin typing your search above and press return to search.
రూపాయి నేల చూపు..సామాన్యుడి బేల చూపు
By: Tupaki Desk | 22 Nov 2016 5:43 AM GMTనోట్ల రద్దు కారణంగా మార్కెట్లో క్యాష్ ఫ్లో తగ్గింది. దానివల్ల ఏం జరగాలి..? వస్తువులకు డిమాండు తగ్గి రూపాయి బలపడాలి. డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ పెరగాలి. కానీ... అందుకు విరుద్ధంగా జరుగుతోంది. గత పది రోజుల్లో డాలరుతో కంపేర్ చేస్తే రూపాయి విలువ 2 రూపాయలు పతనమైంది. ద్రవ్య సరఫరా తగ్గినప్పుడు పుంజుకోవాల్సిన రూపాయి విలువ ఎందుకిలా పతనమవుతోందో అర్థం కాక ఆర్థిక శాఖ తల పట్టుకుంటోందట.
సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి విలువ 68.85 సమీపానికి చేరింది. ఇది మూడేళ్ల కిందట దిగుమతులు భారీగా ఉన్న సమయంలో ఉన్నప్పటి విలువ. రూపాయి వేల్యూ ఇంతకంటే తగ్గితే దేశంలోకి దిగుమతయ్యే ప్రతి ఉత్పత్తి ధరా పెరిగిపోతుంది. అసలే పెద్ద నోట్ల రద్దుతో రోజువారీ ఖర్చులకు కరెన్సీ నోట్లు లేక అల్లాడుతున్న ప్రజల నెత్తిమీద ధరల భారం పడే ప్రమాదం ఉంది.
భారత్ లో కరెన్సీ ఫ్లో తగ్గిన కారణంగా రూపాయి బలపడాలి కానీ... అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు అనుగుణంగా లేవు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ లాంటి వర్థమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలించుకు వెళుతున్నారు. అమెరికాలో వృద్ధి పుంజుకుంటుందన్న అంచనాలతో అక్కడి మార్కెట్లలోకి షిఫ్టవుతున్నారు. దీంతో మన మార్కెట్లలో రూపాయిల రూపంలో ఉన్న పెట్టుబడులు డాలర్లలోకి మారుతున్నాయి. భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు 250 కోట్ల డాలర్ల మేర నిధుల్ని ఉపసంహరించుకున్నారు.దీంతో డాలరు బలపడి - రూపాయి పతనమవుతోంది.
ఈ సమస్య మన ఒక్కరిదే కాదు... ఇండోనేషియా రూపయ్య - చైనా యువాన్ - ఫిలిప్సీన్ పెసో తదితర కరెన్సీలు కూడా నేల చూపులే చూస్తున్నాయి.
- అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ నెలలో పావుశాతం వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలున్నాయి. మనదేశంలో అందుకు విరుద్ధంగా డీమోనిటైజేషన్ తో బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా డిపాజిట్లు రావడంతో రిజర్వు బ్యాంక్ డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అనుకుంటున్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి బ్యాంకుల్లోని తమ పెట్టుబడులను యూఎస్ కు తరలిస్తున్నారు.
- రూపాయి విలువ 68.40ని మించకపోవచ్చని దేశీయ ఆర్థికవేత్తలు ఊరడిస్తున్నా కొత్త భయాలు మాత్రం మార్కెట్ ను వీడడం లేదు. 70 కంటే తక్కువకు పడిపోయే ప్రమాదం ఉందన్న భయాలు కనిపిస్తున్నాయి.
- రూపాయి విలువ పతనం ఆగకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఇంధన ధరలు పెరుగుతాయి. దాంతో రవాణా ఛార్జీలు పెరిగి అన్ని వస్తువుల ధరలు చుక్కలను తాకుతాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/