Begin typing your search above and press return to search.
పల్లె పోరు : ముగిసిన పోలింగ్ .. రెకార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు
By: Tupaki Desk | 13 Feb 2021 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. అయితే తొలి ఫేజ్ ఫోలింగ్ తో పోల్చుకుంటే భారీగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. తొలిదశ ఎన్నికల్లో భారీగా 81.42% పోలింగు నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం 85 శాతం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. 2,786 పంచాయతీలు, 20,817 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే 539 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. రెండో దశలో మొత్తం 3328 పంచాయతీల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. 539 ఏకగ్రీవమయ్యాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఒక పంచాయతీకి ఎన్నిక జరగలేదు.
విజయనగరం జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌లోని 60 పంచాయతీల్లో మధ్యాహ్నమే పోలింగ్ ముగిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు.
జిల్లాల వారీగా మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు :
శ్రీకాకుళం- 69.08 శాతం
విజయనగరం- 80.5 శాతం
విశాఖ జిల్లా- 79.81 శాతం
తూర్పుగోదావరి- 74.97 శాతం
పశ్చిమగోదావరి- 75.54 శాతం
కృష్ణా - 76.64 శాతం
గుంటూరు- 78.08 శాతం
ప్రకాశం - 78.15 శాతం
నెల్లూరు- 72.92 శాతం
చిత్తూరు -72.19 శాతం
కడప- 64.28 శాతం
కర్నూలు జిల్లా- 81.61 శాతం
అనంతపురం- 81.32 శాతం