Begin typing your search above and press return to search.
బ్రిటన్ ప్రధాని పీఠంపై.. రుషి సునాక్?
By: Tupaki Desk | 20 Oct 2022 3:03 PM GMTప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు.. గురిచేసిన బ్రిటన్ ప్రధాని ఎన్నికలు ముగిసి.. 50 రోజులే అయింది. అయితే.. ఇంతలోనే.. ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి.. ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు.. మరోసారి.. భారత సంతతి వ్యక్తి.. రుషిసునాక్‌కు పట్టం కడతారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి.. గతంలోనే సునాక్‌కు బలమైన ఫాలోయింగ్ వచ్చింది. ఆయనే ప్రధాని అవుతారని కూడా.. అనుకున్నారు కానీ, కన్జర్వేటివ్ పార్టీ నాయకులు. లిజ్ ట్రస్‌ను ఎన్నుకున్నారు. అయితే.. ఆమె కేవలం 45 రోజుల్లోనే.. పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
ఏం జరిగింది?
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముదిరిన నేపథ్యంలో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఇప్పటికే లిజ్‌ట్రస్ కేబినెట్‌లో పలువురు మంత్రులు రాజీనామా చేయగా ఆమె కూడా వారి బాటలోనే పయనించారు. 45 రోజుల పాటు మాత్రమే ఆమె బ్రిటన్ ప్రధాని పదవిలో కొనసాగారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తి ట్రస్ కావడం గమనార్హం. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన మూడో మహిళ లిజ్ ట్రస్ కావడం గమనార్హం.
బ్రిటన్‌లో ఆర్థిక అస్థిరత నెలకొని ఉన్నప్పుడు తాను ప్రధానమంత్రి పదవిలోకి వచ్చానని, తనను ఏ ప్రాతిపదికపై టోరీ సభ్యులు ఎన్నుకున్నారో దాన్ని నెరవేర్చలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని లిజ్ ట్రస్ వెల్లడించారు. కన్జర్వేటివ్ పార్టీ లీడర్‌గా రాజీనామా చేస్తున్న విషయాన్ని కింగ్ చార్లెస్‌కు తెలిపినట్లు వివరించారు. ఆర్థిక ఒడుదొడుకులు, అంతర్జాతీయంగా అస్థిరత ఉన్న సమయంలో ట్రస్ బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం కోసం ఆమె ప్రయత్నించారు. బ్రెగ్జిట్‌ను అనుకూలంగా మార్చుకొని పన్నుల భారం తగ్గించి అధిక వృద్ధిరేటు సాధించేందుకు విజన్‌ను సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం ఈ ప్రయోగం వికటించింది.
సునాక్‌కు ఛాన్స్
భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తో పోటీపడిన లిజ్ ట్రస్ ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె రాజీనామాతో ఎలాంటి సంక్షొభం తలెత్తకుండా..రుషి సునాక్ వైపు.. కన్జర్వేటివ్ పార్టీ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన పోల్ సర్వేలో .. సునాక్‌కు అనుకూలంగా 52 శాతం మంది ఉన్నారు.
దీంతో కన్జర్వేటివ్ పార్టీకి వేగంగా నాయకత్వ ఎన్నిక నిర్వహించి వచ్చే వారంలోగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని టోరీ సభ్యులు భావిస్తున్నారు. రిషి సునాక్ ఈ రేసులో ముందున్నారు. అయితే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అనుకూల వర్గం మాత్రం తిరిగి జాన్సన్‌ను ప్రధానిని చేయాలని డిమాండ్ చేస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.