Begin typing your search above and press return to search.
నిషిద్ధ ప్రాంతం : రుషికొండ దరికి రావద్దంతే...?
By: Tupaki Desk | 3 Jun 2022 2:26 PM GMTవిశాఖ బీచ్ రోడ్డులో రుషికొండ టూరిజం స్పాట్ గా ఉంది. దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తూంటారు. అలాంటి రుషికొండలో ఉన్న పాత హొటల్ ని కూల్చేశారు. కొత్త హొటల్ ని నిర్మించాలని చూస్తున్నారు. ఇదంతా టూరిజం శాఖ ఆద్వర్యంలో సాగుతోంది. దాంతో రుషికొండ చుట్టూ వివాదాలు అలముకుంటున్నాయి. కొండను గుండు చేసి పారేశారు అని విపక్షాలు గోల పెడుతున్నాయి.
పర్యావరణ నిబంధలను పక్కన పెట్టి మరీ రుషికొండను తవ్వి పాతరేస్తున్నారు అని పర్యావరణ ప్రేమికులు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. అయినా రుషికొండ తవ్వకాలు యధేఛ్ఛగా జరిగిపోతూంటే రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు జాతీయ హరిత ట్రిబ్యునల్ కి ఫిర్యాదు చేశారు, పిటిషన్ వేశారు, దాంతో నిర్మాణాలకు స్టే ఇచ్చేసింది ఎన్జీటీ.
దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఏపీ సర్కార్ కి పాత హొటల్ ప్రాంతంలో నిర్మాణాలకు మాత్రమే అనుమతి దొరికింది. అయితే రుషికొండను మొత్తం తవ్వేసి ఏం చేయాలనుకుంటున్నారు అని విపక్షాలు ఇప్పటికే యాగీ చేస్తున్నాయి. రుషికొండలో అసలు ఏం జరుగుతోంది అన్నది తాము చూస్తామని విపక్ష నేతలు అక్కడకు వెళ్తే మాత్రం కనీస అనుమతి అయితే ఇవ్వడంలేదు.
దాంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీ సర్కార్ మీద మండిపడ్డారు. రుషికొండ ఏమైనా నిషిద్ధ ప్రాంతమా అని ఆయన నిప్పులు చెరిగారు. అక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయని, ఇపుడు తమకు ఏమీ చూపీంచడంలేదూ అంటే అదే నిజం అని భావించాల్సి వస్తోందని ఆయన అంటున్నారు.
ఇక జీవీఎల్ నే కాదు, ఏకంగా టీడీపీ అధినాయకుడు చంద్రబాబును కూడా తవ్వకాలు చూడకుండా బయటే నిలుపు చేశారు. దాంతో బాబు కూడా వైసీపీ సర్కార్ మీద ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే మొత్తానికి మొత్తం భాగోతాలను వెలికితీస్తామని కూడా ఆయన హెచ్చరించారు కూడా.
ఇక విశాఖకు వచ్చిన జనసేన నాయకుడు నాగబాబు అయితే రుషికొండ అంటే ఏమనుకుంటున్నారు. అది మన హెరిటేజ్. దాన్ని మొత్తం తవ్వేసి గుండుగా మార్చేసే అధికారం మీకు ఎవరించారు అని ద్వజమెత్తారు. ఎర్రమన్ను దిబ్బల్లో మట్టి అమ్ముకుంటారు, హెరిటేజ్ కొండలను పిండి చేస్తారు ఇదేనా అభివృద్ధి అని కూడా నాగబాబు విమర్శించారు. మొత్తానికి రుషికొండ ఇపుడు విశాఖలో టాక్ ఆఫ్ ది సిటీ అయింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది. ఏ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయాలు మాత్రం అసలు అడగకూడదు అంతేగా. అంతేగా.