Begin typing your search above and press return to search.
రుషికొండ బోడిగుండుకు కొత్త ముసుగు
By: Tupaki Desk | 5 Feb 2023 12:44 PM GMTవిశాఖ అంటే చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అందులో రుషికొండ ఒకటి. ఒకనాడు ఇక్కడ రుషులు సారగ తీరానికి అభిముఖంగా కూర్చుని తప్పసు చేసేవారు అని పురాణ గాధలు చెబుతాయి. అందువల్ల రుషికొండ అన్న పేరు వచ్చిందని ప్రచారంలో ఉన్న మాట. ఈ కొండ మీద నిలిచి చూస్తే ఎదురుగా గంభీర సాగరం కెరటాలతో ఉరకలెత్తుతూ కనిపిస్తుంది.
ఎంతో ప్రశాంతత మనసుకు కలుగుతుంది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తూంటారు. వారంతా తప్పనిసరిగా రుషికొండను సందర్శించి అక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. రుషికొండ మీద గతంలో పర్యాటక శాఖ నిర్మించిన కాటేజెస్ ఉన్నాయి. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటి స్థానంలో భారీ భవనాలు నిర్మించడానికి సిద్ధపడింది.
ఈ క్రమంలో పర్యావరణ నిబంధనలను తోసిరాజని మరీ దూకుడు చేసింది అని విపక్షాల ఆరోపణలు ఉన్నాయి. ఇక కొండను పూర్తిగా బోడి గుండుగా మార్చేశారని, అందాలను సహజసిద్ధమైనవి ఇక్కడ ఉంటే వాటిని మొత్తం విద్వంశం చేశారని కూడా విపక్షాలు గట్టిగా మాట్లాడుతున్న నేపధ్యం ఉంది. వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ అయితే రుషికొండను చూసి ఏకంగా కన్నీరు పెట్టేశారు.
ఈ పాపం చేసిన వారు ఎవరైనా క్షమించలేమని కూడా ఆయన ఘాటైన పదజాలం వాడారు. సీపీఐ నారాయణ అయితే కొండలను పిండి చేసి సాధించిందేంటి అని వైసీపీ సర్కార్ ని సూటిగా ప్రశ్నించారు. ఇలా రుషికొండ విషయంలో ప్రభుత్వ తీరుని అందరూ తప్పు పడుతున్న నేపధ్యం ఉంది.
పచ్చని కొండలను కూల్చేశారని, బోడి గుండుతో పేలవంగా మార్చేశారని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుని పోతోంది. అదే సమయంలో మరింత అందంగా రుషికొండను తీర్చిదిద్దుతామని టూరిస్టులకు మరిన్ని మౌలిక సదుపాయాలతో భవనాలు నిర్మిస్తున్నామని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది.
ఈ నేపధ్యంలో తాజాగా బోడి కొండను ఎవరూ చూడకుండా ఉండేందుకు జర్మన్ టెక్నాలజీతో కూడిన జియో మ్యాటింగ్ తో అక్కడ కవర్ చేస్తోంది అని మరోసారి విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఉంది అంటున్నారు. మార్చి 28, 29లలో జీ 20 సదస్సులు విశాఖలో జరగనున్నాయి. దాంతో రుషికొండ బోడి కొండగా ఉంటే వచ్చే అతిధులు విస్తుపోతారు ఇదేమిటి అని ముక్కున వేలేసుకుంటారు అని భావించే కవరింగ్ కోసం ఇలా జియో మ్యాటింగ్ చేసింది అని అంటున్నారు.
ఇలా అత్యంత ఖరీదైన మ్యాటింగ్ ని కొండకు ఒక చోట పూర్తిగా పరచి కవర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక మరికొద్ది రోజులలో మొత్తం రుషికొండ ప్రాంతాన్ని పచ్చగా ఉండే విధంగా జియో మ్యాటింగ్ తో కవర్ చేస్తారని అంటున్నారు. అయితే దీని మీద వైసీపీ నాయకులు తమదైన వాదన వినిపిస్తున్నారు. రుషికొండ ను బోడికొండగా మార్చలేదని అదే సమయంలో కొండ మీద ఉన్న ఖనిజాలు జారిపోకుండా ఉండేందుకు, పచ్చదనం తో మళ్లీ పరిమళించాలన్న ఉద్దేశ్యంతోనే జియో మ్యాటింగ్ చేస్తున్నామని అంటున్నారు.
తాము ఏమి చేసినా తప్పు పడుతూ పెడార్ధాలు విపక్షాలు తీస్తున్నాయని అంటున్నారు. ఇది ఖరీదైన ప్రాసెస్ అయినా రుషికొండ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఇలా చేస్తున్నామని కూడా చెబుతున్నారు. తాము రుషికొండ పరిరక్షణ దాని డెవలప్మెంట్ లో భాగంగానే ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే చేస్తున్నామని అంటున్నారు. రెండు మూడు నెలల నుంచే ఈ ప్రాసెస్ జరుగుతోందని, జీ 20 కోసమే చేస్తున్నామనడం తప్పుడు ప్రచారం అని వైసీపీ నేతలు వివరణ ఇస్తున్నారు.
ఏది ఏమైనా రుషికొండ సహజసిద్ధమైన పచ్చదనంతో అలరారుతున్న దాన్ని మార్చేసి ఇపుడు జియో మ్యాటింగ్ చేయడం చూస్తూంటే ఏదో వెలితి కొరతగా ఉందని ప్రజలు అంటున్నారు. మరి ప్రభుత్వం రుషికొండని మరింత అందంగా చూపుతామని అంటోంది. ఆలోచించాల్సిన మాట ఇది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.