Begin typing your search above and press return to search.

రష్యా బంగారం పై నిషేధం!

By:  Tupaki Desk   |   27 Jun 2022 5:47 AM GMT
రష్యా బంగారం పై నిషేధం!
X
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ఇప్పటికే వందలాది ఆంక్షలను విధించిన నాటో దేశాలు, జీ 7 దేశాలు తాజాగా మరో నిషేధాన్ని విధించబోతోంది. అదేమిటంటే బంగారాన్ని కొనుగోలు చేయకూడదని.

రష్యా నుండి ఎగుమతి అయ్యే బంగారాన్ని విదేశాలు కొనకూడదని తీర్మానించుకున్నాయి. దీనివల్ల రష్యా ఆర్ధిక పరిస్ధితిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని గమనించాల్సిందే.

రష్యానుండి నాటో, జీ 7 దేశాలకు అత్యధికంగా ఎగుమతయ్యేవి చమురు, సహజవాయువులే. రష్యా నుండి అందుతున్న గ్యాస్ పైన సుమారు 30 దేశాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. వీటిలో ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్ లాంటి దేశాల్లో 80 శాతం వాడకానికి రష్యా నుండి అందుతున్న గ్యాసే ఆధారం. ఇపుడు హఠాత్తుగా గ్యాస్ సరఫరా ఆగిపోవటంతో చాలా దేశాలు అల్లాడిపోతున్నాయి. అలాగే చమురుకు కూడా పై దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.

తమనుండి గ్యాస్, చమురు కొనుగోలుపై నిషేధం విదించటంతో రష్యాకు కూడా ఇబ్బందులుపడింది. అయితే చైనా, భారత్ కొనుగోలు చేస్తుండటంతో ఇబ్బందుల నుండి రష్యా బయటపడింది. అలాంటిది ఇపుడు బంగారం కొనుగోలుపై నిషేధం ఆసక్తిగా మారింది. పై దేశాలు కొనుగోలు చేయాల్సిన బంగారాన్ని బహుశా చైనా, భారత్ కు పంపుతారేమో చూడాలి. గ్యాస్, చమురులాగ బంగారం అనేది నిత్యావసరం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

బంగారాన్ని కొనుగోలు చేయకపోయినా జనాలకు వచ్చే నష్టమేదీలేదు. కాకపోతే రష్యా ఎగుమతులపై నిషేధం కారణంగా ఆర్ధికంగా దెబ్బ పడవచ్చు. అయితే నాటో, జీ 7 దేశాల జనాలు కొనుగోలుతో పోల్చుకుంటే చైనా, భారత్ లో బంగారం వాడకం చాలా ఎక్కువ.

ప్రపంచం మొత్తంలో చూసుకుంటే బంగారాన్ని ఎక్కువగా వాడేది చైనా, భారత్ జనాలు మాత్రమే. బహుశా బంగారం వ్యాపారం విషయంలో రష్యా-భారత్ మధ్య ఒప్పందం జరిగితే చౌక ధరలకే దొరుకుతుందేమో చూడాలి. ఇపుడు చమురును రష్యా తక్కువ ధరలకు అందిస్తోంది కదా. కాబట్టి మనదేశంలో భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గితే మంచిదే కదా.