Begin typing your search above and press return to search.

కీవ్ ను దిగ్బంధించిన రష్యా

By:  Tupaki Desk   |   13 March 2022 5:30 AM GMT
కీవ్ ను దిగ్బంధించిన రష్యా
X
గడచిన పదిరోజులుగా ప్రశాంతంగా సరిహద్దు ప్రాంతాల్లో కూర్చునున్న రష్యా సైన్యం ఒక్కసారిగా కీవ్ పై విరుచుకుపడుతోంది. పదిరోజుల క్రితమే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం శివారు ప్రాంతాలకు రష్యా సైన్యాలు చేరుకున్నాయి. కీవ్ ను అన్నీవైపుల నుండి చుట్టుముట్టేశాయి. యుద్ధ ట్యాంకులు, మిస్సైల్ లాంచర్లు, అత్యంతాధునిక ఆయుధాలతో సైన్యం ప్రశాంతంగా కాపువేసుకుని కూర్చున్నాయి. కీవ్ చుట్టుపక్కల సుమారు 40 కిలోమీటర్ల విస్తార్ణంలో రష్యా సైన్యం క్యాంపు వేసుకుని కూర్చున్నది.

కీవ్ నగరం దగ్గరకు వచ్చి కూడా ఎందుకు లోపలకు వెళ్ళే ప్రయత్నం చేయలేదో ఎవరికీ అర్ధంకాలేదు. ట్యాంకుల, యుద్ధ వాహనాలను, ఆయుధాలతో సహా సైన్యం జస్ట్ క్యాంపు వేసుకుని కామ్ గా కూర్చున్నదంతే. రష్యా ఆలోచన ఏమిటో అర్ధంకాక ప్రపంచదేశాలు విచిత్రంగా చూశాయి. ఇన్ని రోజులు కామ్ గా కూర్చున్న రష్యా సైన్యం శనివారం నుండి హఠాత్తుగా దాడులు మొదలుపెట్టాయి. కీవ్ కు ఇతర ప్రాంతాలతో రోడ్డు మార్గాలను మూసేశాయి.

అలాగే కీవ్ గగనతలాన్ని కూడా రష్యా తన ఆధీనంలోకి తీసేసుకుంది. ఇపుడు రష్యా సైన్యం నగరంలోకి ప్రవేశిస్తోంది. నివాస సముదాయాలను, వాణిజ్య భవనాలను, ఆఫీసులను తమ క్షిపణులతో కూల్చేస్తున్నాయి. రాజధాని కీవ్ నగరాన్ని గనుక రష్యా స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ దేశమంతా స్వాధీనం అయిపోయినట్లే అనుకోవాలి. బహుశా రాజధాని నగరంలో విధ్వంసం సృష్టించటం ఇష్టంలేకే రష్యా సైన్యం ఇన్నిరోజులు ఓపికపట్టిందని అనుకోవాలి.

దేశంలో జరుగుతున్న విధ్వంసానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లొంగిపోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భావించుంటారు. అప్పుడు కీవ్ లోకి ప్రవేశించి విధ్వంసం చేయాల్సిన అవసరం ఉందని పుతిన్ అనుకునుండవచ్చు.

కానీ రష్యా ఆలోచనలకు భిన్నంగా జెలెన్ స్కీ నడుచుకుంటున్నాడు. అందుకనే ఇన్నిరోజులు వెయిట్ చేసిన సైన్యం ఇపుడు తప్పనిస్ధితిలో కీవ్ లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ సైన్యం+మామూలు జనాలు ప్రతిఘటిస్తున్నా రష్యా సైన్యం ముందు నిలవలేకపోతున్నారు. ఏదేమైనా కీవ్ ను రష్యా దిగ్బంధించేసిందన్నది వాస్తవం.