Begin typing your search above and press return to search.

ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్న రష్యా

By:  Tupaki Desk   |   4 March 2022 7:32 AM GMT
ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్న రష్యా
X
యుద్ధం మొదలైన ఏడో రోజు ఉక్రెయిన్లోని కీలక నగరమైన ఖేర్ సన్ ను రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్నది. అంటే ఉక్రెయిన్లోని ఒక నగరాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవటానికి రష్యాకు ఏడు రోజులు పట్టింది. రష్యా స్వాధీనంలోకి వెళ్ళిన ఖేర్ సన్ నగరం ఉక్రెయిన్లో చాలా కీలకమైనది. విదేశాలతో జల రవాణాకు ఖేర్సన్ ఓడరేవు అత్యంత ప్రాధాన్యత ఉన్న నగరం. ఓడరేవుతో పాటు నగరం పరిపాలనా భవనాలను కూడా రష్యా సైన్యం తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నది.

ఖేర్సన్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా అంగీకరించారు. అలాగే మరియు పోల్, ఖర్కివ్ నగరాలను ఆధీనంలోకి తీసుకోవటానికి రష్యా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. నగరాలను ఆధీనంలోకి తీసుకోవటానికి రష్యా సైన్యం ఎంత ప్రయత్నిస్తుంటే ఉక్రెయిన్ సైన్యం అంతగా ప్రతిఘటిస్తోంది. సైన్యానికి మద్దతుగా మామూలు జనాలు కూడా తుపాకులు, పెట్రోలు, డీజిల్ బాంబులను ప్రయోగిస్తుండటంతో పరిస్థితి అంతా జటిలంగా తయారైపోయింది.

ఖర్కివ్, మరియు పోల్ నగరాలను స్వాధీనం చేసుకోవటానికి రష్యా సైన్యం ఎంతగా ప్రయత్నిస్తున్నా నగరంలోకి అడుగుపెట్టలేకపోతోంది. నగరం బయట నుండే తమ ఆయుధాలను ప్రయోగిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. దీనివల్ల ఇప్పటికి సుమారు 3 వేల మంది పౌరులతో పాటు వందల సంఖ్యలో సైనికులు కూడా చనిపోయారు. ఆస్తి, ప్రాణ నష్టంపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ యుద్ధం అన్నా ఎంత భారీగా నష్టాలు ఉంటాయనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇదే సమయంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను అదుపులోకి తీసుకోవటానికి రష్యా సైన్యం విపరీతంగా కష్టపడుతోంది. నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో భారీ కాన్వాయ్ ను రష్యా నిలిపుంచింది. ఇక్కడే నుండే క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు రోజులుగా యుద్ధ ట్యాంకులను, ఫిరంగులతో పాటు ఇతర వాహనాలను ఎందుకు నిలిపుంచింది అన్నదే అర్ధం కావటం లేదు. బహుశా ఇంధనం, ఆహారం కొరత కారణంగానే వాహనాలు కదలటం లేదని అనుమానిస్తున్నారు. మరి ఖర్కివ్, మరియు పోల్ నగరాలను స్వాధీనం చేసుకోవటానికి ఎంతకాలం పడుతుందో చూడాల్సిందే.