Begin typing your search above and press return to search.

ఫేస్‌బుక్ కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఆ దేశం!

By:  Tupaki Desk   |   12 Oct 2022 9:55 AM GMT
ఫేస్‌బుక్ కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఆ దేశం!
X
ఫేస్‌బుక్ కు ర‌ష్యా దిమ్మ‌తిరిగే షాకిచ్చింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటాను ఏకంగా ఉగ్ర‌వాద సంస్థ‌ల జాబితాలో చేర్చింది. ఉగ్ర‌వాదాన్ని వ్యాపింప‌జేసే సంస్థ‌గా ఫేస్ బుక్‌ను ర‌ష్యా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఫేస్‌బుక్ అమెరికాకు చెందిన సంస్థ అనే విష‌యం తెలిసిందే. దీన్ని మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఏర్పాటు చేశారు. త‌ర్వాత ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల‌ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల‌ను మెటా సంస్థ‌కు కింద‌కు చేర్చారు.

త‌ద్వారా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల‌తో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ సంపాద‌న అమాంతం పెరిగింది. ఒక ద‌శ‌లో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుల్లో మూడో స్థానానికి జుక‌ర్‌బ‌ర్గ్ దూసుకెళ్లారు. ఆ త‌ర్వాత ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల ద్వారా యూజ‌ర్ల డేటాను ఫేస్‌బుక్ సేక‌రిస్తోంద‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌గ్గోలు రేగింది.

దీనిపై యూజ‌ర్ల‌కు స‌రైన వివ‌ర‌ణాత్మ‌క సమాచారాన్నిఇవ్వ‌డంలో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ విఫ‌ల‌మ‌య్యారు. దీంతో వాటిపై యూజ‌ర్ల‌కు అనేక సందేహాలు నెల‌కొన్నాయి. దీంతో ఆ ప్ర‌భావం అటు తిరిగి ఇటు తిరిగి మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ సంపాద‌న పైన ప‌డింది. దీంతో ఆయ‌న టాప్‌-3 నుంచి చివ‌ర‌కు టాప్ 20లో కూడా లేకుండా పోయారు. ప్ర‌పంచంలో అత్య‌ధిక ధ‌న‌వంతుల్లో ప్ర‌స్తుతం జుక‌ర్ బ‌ర్గ్ 23వ స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

కాగా ఉక్రెయిన్ -ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఉక్రెయిన్ కు మ‌ద్ద‌తుగా మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ వ్య‌వ‌హ‌రించారు. ర‌ష్యాను ఇబ్బందిపెట్టే ప‌నులు చేశారు. దీంతో ఒళ్లు మండిన ర‌ష్యా అధినేత వాద్లిమిర్ పుతిన్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల మాతృ సంస్థ‌ను ఉగ్ర‌వాద సంస్థ‌ల జాబితాలో చేరుస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ మేరకు ఫెడరల్ సర్వీస్ ఫర్ ఫైనాన్షియల్ మానిటరింగ్ డేటా బేస్ తెలిపింది. రష్యా ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌పై మార్చిలోనే నిషేధం విధించింది.

ఫేస్‌బుక్ కు పోటీగా టిక్‌టాక్, యూట్యూబ్ వంటివాటివైపు యూజ‌ర్లు ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నారు. దీంతో ఫేస్‌బుక్ ఆదాయం త‌గ్గిపోయింది. దీంతో కుబేరుల జాబితాలో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కూడా దిగువ‌కు ప‌డిపోయారు. ఇక ఇప్పుడు మెటాపై ర‌ష్యా తీవ్ర చ‌ర్య‌తో ఫేస్‌బుక్ మ‌రిన్ని ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌దు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.