Begin typing your search above and press return to search.

వార్ వేళ.. ఉక్రెయిన్ దెబ్బకు రష్యాకు అంత డ్యామేజా?

By:  Tupaki Desk   |   4 March 2022 4:30 AM GMT
వార్ వేళ.. ఉక్రెయిన్ దెబ్బకు రష్యాకు అంత డ్యామేజా?
X
చూసేందుకు చాలా చిన్న టార్గెట్ అనుకున్న ఉక్రెయిన్ మెడలు వంచటం అంత తేలికైన విషయం కాదన్న సంగతి రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ కు అర్థమైనా అర్థం కాకున్నా.. రష్యా సైనికులకు మాత్రం బాగానే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. వారానికి పైనే సాగుతున్న పోరులో ఉక్రెయిన్ భారీగా నష్టపోయిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ.. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే..యుద్ధానికి తెగబడ్డ రష్యాకు సైతం భారీ దెబ్బలు తగిలాయని.. సైన్యానికి.. రక్షణ బలగాలకు ఉండాల్సిన ఆత్మవిశ్వాసం పూర్తిగా పోయినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎంత త్వరగా పుతిన్ గుర్తిస్తే.. అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. రష్యన్ వార్తా సంస్థలు.. వారి నుంచి విడుదల అవుతున్న వార్తల్ని చూసినప్పుడు మాత్రం ఉక్రెయిన్ దారుణంగా దెబ్బ తింటోందన్న మాటను ప్రముఖంగా చూపిస్తున్నారు. అయితే.. వారు చెప్పినంత సీన్ లేదంటున్నారు. ఆ మాటకు వస్తే.. రష్యా సైన్యానికి ఉక్రెయిన్ సేనలు సరిహద్దుల్లో చుక్కలు చూపిస్తున్నారని చెబుతున్నారు. రష్యా సేనలు కదలి రావటమైతే వస్తున్నాయి కానీ.. వాటి మధ్య ఏ మాత్రం సమన్వయం లేదంటున్నారు. ఇదే తీరులో ముందుకు సాగితే.. రష్యన్ సైనలకు చేదు అనుభవం తప్పదంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ తో జరిగిన యుద్ధంలో తమకు జరిగిన నష్టం పరిమితంగా చూపిస్తున్న రష్యా.. వాస్తవానికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న మాట వినిపించింది. ఎందుకంటే.. ఉక్రెయిన్ దాడుల్లో రష్యాకు చెందిన పలు విమానాలు.. హెలికాఫ్టర్లు.. సైన్యం భారీగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. తాజాగా బయటకు వస్తున్న లెక్కల ప్రకారం చూస్తే.. ఉక్రెయిన్ సైన్యం చేతిలో ఇప్పటివరకు 9వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీంను స్పష్టం చేస్తున్నారు.

అంతేకాదు.. 217యుద్ధ ట్యాంకులు.. 900 సాయుధ శకలాలు.. 374 యుద్ద విమానాలు.. 90 ఫిరంగులు.. 30విమానాలు.. 31 హెలికాఫ్టర్లు.. వందల సంఖ్యలో ఇంధన ట్యాంకులు.. భారీ మొత్తంలో యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేస్తామంటున్నారు. ఇలా చెబుతున్న లెక్కలతో రష్యా ఇరుకున పడుతోంది. ఇప్పటివరకు తమకు తిరుగులేదని ప్రచారం చేసుకుంటున్న రష్యాకు.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఉక్రెయిన్ లో ఎదురవుతున్నట్లుగా చెబుతున్నారు.