Begin typing your search above and press return to search.
ఆ దేశాధ్యక్షుడు రక్తంతో స్నానం చేస్తారట!
By: Tupaki Desk | 20 July 2017 4:48 PM GMTసాధారణంగా ఫిట్ నెస్ కోసం వ్యాయామం - యోగా చేసేవాళ్ల గురించి విని ఉంటాం. డైలీ జాగింగ్ - రన్నింగ్ చేసే వాళ్లను చూస్తుంటాం. కానీ, ఫిట్ నెస్ కోసం ఓ జంతువు రక్తంలో స్నానం చేయడం గురించి పెద్దగా ఎవరికీ తెలిసుండదు. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తన ఫిట్ నెస్ కోసం తరచుగా దుప్పి రక్తంలో స్నానం చేస్తారట. అందుకే 64 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఫిట్ గా కనిపిస్తారు.
దుప్పి రక్తంలో స్నానం చేసేందుకే పుతిన్ తరచుగా రష్యాలోని అల్తాయ్ పర్వత ప్రాంతాలకు వెళతారట. కొద్ది రోజుల క్రితం పుతిన్ అక్కడకు వెళ్లినపుడు అధికారులు దుప్పి రక్తాన్నిఏర్పాటు చేశారట.రష్యా ప్రధాని దిమిత్రీ మెడ్వెదేవ్ కు కూడా ఈ రక్తపు జలకాలాడే అలవాటు ఉందట. 2015లో ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లిస్కోనీ... సైబీరియా పర్యటనకు వచ్చినపుడు ఈ దుప్పిరక్తం ప్రాధాన్యతను గురించి పుతిన్ వివరించారట. అప్పటినుంచి ఆయన కూడా దుప్పి రక్తంలో స్నానం చేయడం ప్రారంభించారట. జంతు ప్రేమికులు మాత్రం ఈ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. పుతిన్ రక్తపు జలకాలాటల గురించి స్థానిక పత్రిక ‘రిపబ్లిక్’ఓ కథనాన్ని ప్రచురించింది.
15వ శతాబ్దానికి చెందిన రష్యన్ సాహిత్యంలో దుప్పి రక్తం గురించిన ప్రాధాన్యం గురించి అనేక పుస్తకాలు ప్రాచుర్యం పొందాయట. అప్పటినుంచి కొంతమంది రష్యన్ ప్రజలు ఈ రక్తపు స్నానాన్ని ఆచరిస్తున్నారట. ఈ విధంగా దుప్పి రక్తంలో స్నానం చేయడం వల్ల శరీరంలోని ఎముకలు - కండరాలు - నడుము - కీళ్లు బలంగా తయారవడమే కాకుండా లైంగిక పటుత్వ శక్తి గణనీయంగా పెరుగుతుందట. అంతే కాదు, ఈ స్నానం చేయడం వల్ల దృష్టి, వినికిడి శక్తి కూడా పెరుగుతుందట.
దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని, లైంగిక పటుత్వాన్ని పెంచే ‘టెస్టోస్టెరేన్’ పెరుగుతుందని రష్యన్ల నమ్మకం. చైనాలో వయాగ్రా తరహా ఉత్పత్తుల్లో దుప్పి రక్తాన్ని ఎక్కువగా వాడుతుంటారు. నిమోనియా, ఆస్తమా, ఆస్టియోపొరోసిస్, ప్లూరిసీలాంటి జబ్బులకు, వెన్నుముక సమస్యలకు దుప్పి రక్తం బాగా పనిచేస్తుందట.