Begin typing your search above and press return to search.
తొలిసారి: దూకుడుగా ఉక్రెయిన్.. భయపడుతున్న రష్యా!
By: Tupaki Desk | 15 Oct 2022 4:34 AM GMTయుద్ధం మొదలైతే చాలు మహా అయితే వారం మాత్రమే పోరాడుతుంది.. ఆ తర్వాత పాదాక్రాంతమవుతుందన్న భావనతో ఉక్రెయిన్ దురాక్రమణకు తెర తీసిన రష్యా వైఖరి తెలిసిందే. ప్రాశ్చాత్య మీడియా మొదలు మన దేశంలోని మీడియా సైతం.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధమని చెబుతున్నప్పటికీ.. అది వార్ ఎలా అవుతుందన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లభించని పరిస్థితి.
యుద్ధం అంటే రెండు దేశాల మధ్య జరిగేది. కానీ.. ఈ ఎపిసోడ్ లో ఉక్రెయిన్ మీద దురాక్రమణ చేస్తూ.. రష్యా ఒంటెద్దుపోకడల్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ మీద దాడి చేసి.. దాన్ని ఇట్టే స్వాధీనం చేసుకోవటం సాధ్యం కాదన్న విషయం రష్యాకు అర్థం కావటమే కాదు.. ఈ ఇష్యూను ఇప్పుడు సెటిల్ చేసుకోవటం ఎలా అన్నది వారికిప్పుడు సమస్యగా మారింది.
రష్యా దాడి నుంచి కాచుకోలేక.. చేతులెత్తేసినట్లుగా మొదట్లో ఉక్రెయిన్ కనిపించినప్పటికీ.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. రష్యాకు చుక్కలు చూపిస్తోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ కోలుకోలేనంత దారుణ.. దీన పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నా.. 'తగ్గేదేలే' అన్న రీతిలో వ్యవహరిస్తూ పోరాడుతోంది. అనుకోని రీతిలో దాడులు చేస్తూ.. రష్యాకు కొరకరాని కొయ్యిలా మారుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఉక్రెయిన్ వ్యవహరిస్తున్న తీరు రష్యాకు మింగుడుపడని రీతిలో మారటమే కాదు.. తొలిసారి భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఉక్రెయిన్ కు చెందిన నాలుగు ప్రాంతాల్ని (ఖేర్సన్, దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా) స్వాధీనం చేసుకున్న రష్యా మరింత ముందుకు వెళ్లాల్సింది పోయి.. తాము సొంతం చేసుకున్న ప్రాంతాల్లో పట్టుకోల్పోతున్న పరిస్థితి. ఈ మధ్యనే తాము స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల్ని రష్యా సమాఖ్యలో చేరుస్తున్నట్లుగా పుతిన్ సంతకాలు చేయటమే కాదు.. ఆ దేశ పార్లమెంట్ లోని దిగువ సభ డ్యూమా ఆమోదం తెలిపింది. అయితే.. ఇప్పుడా నాలుగు నగరాల్లో ఒకటైన ఖేర్సన్ ను తిరిగి ఉక్రెయిన్ సొంతం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.
తాజా పరిణామాలతో రష్యా ఆందోళన చెందుతోంది. తాము పాక్షికంగా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంలో నివసించే వారంతా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని.. వారందరికి రష్యాలో ఉచిత వసతి ఏర్పాటు చేశామని.. అక్కడకు రావాలంటూ రష్యా ఉప ప్రధాని మరత్ ఖుస్నుల్లిన్ కోరటం గమనార్హం. తరలింపు వ్యవహారం రష్యా స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల నుంచి సాగుతోంది.
సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో తొలిసారి రష్యాపై అధిక్యతను ప్రదర్శించిన ఉక్రెయిన్ ఖేర్సన్ ప్రాంతాన్ని సొంతం చేసుకోవటంతో దాడులు మరింత తీవ్రతరం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధం పుణ్యమా అని ప్రపంచం మొత్తం ప్రభావితమవుతున్న పరిస్థితి. తాము సొంతం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతం తిరిగి ఉక్రెయిన్ చేతుల్లోకి వెళ్లిపోయిన వైనంపై రష్యా ఏ తీరులో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అదే అందరిని ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.