Begin typing your search above and press return to search.

కరోనా:ట్రంప్-పుతిన్ చర్చలు.. అమెరికాకు రష్యా వైద్య సాయం

By:  Tupaki Desk   |   2 April 2020 1:00 PM GMT
కరోనా:ట్రంప్-పుతిన్ చర్చలు.. అమెరికాకు రష్యా వైద్య సాయం
X
రెండు శత్రుదేశాలను సైతం కరోనా కలిపేసింది. అగ్రరాజ్యం అమెరికా కరోనా తో అల్లకల్లోలంగా మారడం తో దాని ప్రత్యర్థి దేశం రష్యా సాయానికి ముందుకొచ్చింది. అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. 2.13 లక్షల మందికి పైగా కరోనా సోకింది. 5వేలకు పైగా మృత్యువాతపడ్డ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలు జరిపారు. ట్రంప్ స్వయంగా రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేసి పరిస్తితి వివరించారు. తమకు వైద్య పరికరాలు సమకూర్చాలని కోరారు. దీంతో పుతిన్ అంగీకరించాడు.

ఈ నేపథ్యంలోనే అమెరికాకు రష్యా వైద్య సహాయం చేయడానికి ముందుకొచ్చింది. కరోనా వైరస్ బాధితులకు కావలసిన మెడికల్ కిట్లు, పరికరాల తో రష్యా విమానం అమెరికాలో అడుగుపెట్టింది. అమెరికాకు తమ సహకారం అందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

రష్యా నుంచి తాజాగా అమెరికాకు వచ్చిన విమానం లో వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు ఉన్నాయి. మాస్కులు, వైద్య పరికరాలు ఉన్నాయి.

ఇక ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన అమెరికన్లను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటివరకు 350కి పైగా విమానాలతో 60కి పైగా దేశాల నుంచి 30వేల మంది పౌరులను అమెరికా స్వదేశానికి రప్పించింది.