Begin typing your search above and press return to search.

అమెరికాను వణికిస్తున్న ఆ నాలుగు దేశాలు!

By:  Tupaki Desk   |   21 Sep 2016 5:24 AM GMT
అమెరికాను వణికిస్తున్న ఆ నాలుగు దేశాలు!
X
అగ్రరాజ్యం కదా వారికి భయమేమిఉంటుంది.. ప్రపంచానికి పెద్దన్న కదా వారికి ప్రమాదం ఏముంటుంది.. వారిపై దాడిచేసే స్థాయి ఎవరికి ఉంటుంది అని అనుకుంటే అమ్రికావిషయంలో పొరబడినట్లే. ఎందుకంటే... అమెరికాకు కూడా పెద్ద డెంజరే ఉంది. ఈ విషయాలు పత్రికలో - సర్వేలో తెలిపినవి కావు... తమకు ఎవరెవరి వల్ల ప్రమాదం ఉంది అనే విషయాన్ని అమెరికానే స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికాకు అత్యంత ప్రమాదకరమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తే ఆ దేశాలే ముందుంటాయని చెబుతుంది.

అవును.. భవిష్యత్తులో అమెరికాకు ప్రమాదం వస్తే ఆ విషయంలో తొలి స్థానంలో రష్యా ఉంటుందని - ఆ తర్వాత స్థానంలో చైనా ఉంటుందని చెబుతుంది అమెరికా. ఈ మేరకు అమెరికా రక్షణ స్థావరం పెంటగాన్ వ్యూహాత్మక కమాండర్ జనరల్ జాన్ ఈ హేటన్ ఈ విషయాలు చెబుతున్నారు. ఈ విషయంలో రష్యా - చైనాలు పోటీ పడుతుంటే.. వారితో పాటు మేము కూడా ఉన్నామని చెప్పకనే చెబుతున్నాయట ఉత్తర కొరియా - ఇరాన్. ఈ విషయంలో ఉత్తరకొరియా మరింత ప్రమాదకరంగా తయారవుతుందని - దాని తాజా ప్రవర్తన అలానే ఉందని చెబుతుంది అమెరికా.

అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తే.. అది కచ్చితంగా రష్యా వల్లేనని.. ఆ తర్వాతి స్థానాల్లో చైనా ఉంటుందని... చైనా తర్వాత స్థానంలో తర్వాత ఉత్తర కొరియా - ఇరాన్ లు ఉన్నాయని అమెరికా చెబుతుంది. ఈ మధ్యకాలంలో ఉత్తర కొరియా అణు క్షిపణులు - అణ్వాస్త్రాలు పరీక్షలు ఎందుకు చేస్తుందో - మిసైల్ ప్రోగ్రామ్స్ ఎందుకు నిర్వహిస్తుందో తమకు అర్ధం కావడంలేదని అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అనుకుంటాం కానీ.. ఎంత చెట్టుకు అంత గాలి కదా. చిన్న దేశాలకు చిన్న చిన్న భయాలు ఉంటే.. అగ్రారాజ్యనికి కూడా ఆందోళన ఆస్థాయిలోనే ఉంది!!