Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధినేత సంచలన ప్రకటన!
By: Tupaki Desk | 23 Dec 2022 10:31 AM GMTఉక్రెయిన్ పైకి రష్యా దండెత్తి పది నెలలు పూర్తవుతున్నాయి. రష్యా వ్యతిరేక శక్తులకు ఉక్రెయిన్ దగ్గరవుతుందనే కారణాలను సాకుగా చూపి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పైకి ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మొదట్లో ఉక్రెయిన్ ను అతి సులువుగా జయించేలా కనిపించిన రష్యాకు ఆ తర్వాత పరిణామాలు ఎదురుతన్నాయి. ఈ పది నెలల కాలంలో జరిగిన యుద్ధంలో ఏకంగా లక్షకుపైగా రష్యా సైనికులు బలయ్యారు. ఉక్రెయిన్ తో పోలిస్తే రష్యాకు జరిగిన నష్టం కూడా తక్కువ కాదు.
మరోవైపు అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల మద్దతు కూడా ఉక్రెయిన్ కే లభిస్తోంది. ఆయా దేశాలు అందిస్తున్న ఆర్థిక సాయం, ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాకు తలొగ్గడం లేదు. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్నందుకు ఆయా దేశాలు రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. పాశ్చాత్య దేశాలు అందించిన ఆర్థిక సాయం, ఆయుధాలతో ఉక్రెయిన్ గట్టి పోరాటమే చేస్తోంది. ఈ క్రమంలో రష్యా మొదట్లో తమ నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను కూడా తిరిగి చేజిక్కుంచుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వేగంగా ముగించాలనుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యా రాజధాని మాస్కోలో మీడియాతో మాట్లాడుతూ పుతిన్ ఈ వాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తాము ఇందుకోసం కష్టపడుతున్నామని తెలిపారు. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పుతిన్ వెల్లడించారు. దీనిని త్వరలోనే మెరుగ్గా ముగిస్తామని చెప్పారు. ప్రతి సంక్షోభం ఏదో రకంగానో, చర్చలతోనే ముగుసుందని పుతిన్ చెప్పడం విశేషం.
ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలను అమెరికా సమకూర్చడంతోపాటు 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్ కు అందించడానికి ముందుకొచ్చింది.,
విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి అమెరికా వెళ్లిన జెలెన్‌స్కీకి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. ఆయన అమెరికాకు వెళ్లడానికి కొన్ని గంటల ముందే దాదాపు 1.8 బిలియన్ డాలర్ల విలువైన సైనిక ఉత్పత్తులను ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాకుండా క్షిపణి దాడులను సైతం తట్టుకునేందుకు వీలుగా పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు అందిస్తామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా భరోసా ఇచ్చింది.
ఓవైపు అమెరికా ఆయుధ సాయం, మరోవైపు కఠిన శీతాకాల పరిస్థితులతో యుద్ధాన్ని ముగించడమే శ్రేయస్కరమని పుతిన్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. కఠినమైన చలిని తట్టుకుని యుద్ధం చేసే పరిస్థితిలో రష్యన్ సైనికులు లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని విరమిస్తామని పుతిన్ ప్రకటించారని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.