Begin typing your search above and press return to search.
రష్యాలో కరోనా కల్లోలం..ఒకే రోజు 10 వేల కొత్త కేసులు!
By: Tupaki Desk | 3 May 2020 5:04 PM GMTప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా... అగ్రరాజ్యం అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలను నిజంగానే గడగడలాడించేసింది. అయితే క్రమంగా ఆ దేశాల్లో వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తున్న వేళ.. ఈ వైరస్ వ్యాప్తి రష్యాలో తీవ్ర కలకలం రేపుతోంది. నిన్నటిదాకా అమెరికాకు నిద్ర లేకుండా చేసిన కరోనా.. ఇప్పుడు రష్యాను తీవ్ర ఆందోళనలోకి నెట్టేసిందని చెప్పక తప్పదు. ఇందుకు నిదర్శనంగా ఆదివారం ఒక్కరోజే రష్యాలో ఏకంగా 10 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఒకే రోజు పెరుగుదలలో ఇది వరుసగా నాల్గవ రికార్డు. నాలుగురోజుల నుంచి రికార్డు స్థాయిల్లో కరోనా కేసులు నమోదవుతుంటం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు పెద్ద తలనొప్పిగా మారిందని కూడా చెప్పక తప్పదు.
రష్యాలో ఆదివారం ఒకే రోజున 10,633 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ తాత్కాలిక ఆసుపత్రులు ప్రారంభించారు. మరోవైపు కొత్తగా నిర్ధారణ అవుతున్న కేసుల్లో సగానికిపైగా ఎలాంటి రోగ లక్షణాలు లేనివారే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. రష్యాలో ఇప్పటిదాకా మొత్తం 1,34,687 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక్క రాజధాని మాస్కోలోనే నమోదు కావడం గమనార్హం. అయితే అక్కడ మరణాల శాతం మాత్రం తక్కువగా ఉండటం కాస్తంత ఊరటనిచ్చే అంశమేనని చెప్పాలి. రష్యాలో కరోనా పాజిటివ్ కేసులు 1.34 లక్షలకు చేరినా... అక్కడ నమోదైన మరణాలు మాత్రం కేవలం 1,280 మాత్రమే. గడచిన 10 రోజుల్లోనే రష్యాలో మరణాల రేటు రెట్టింపయ్యింది. అయితే ఏపీలో మాదిరే రష్యాలో కూడా ఇటీవల టెస్టుల సంఖ్య పెంచిన నేపథ్యంలో కొత్తగా కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే... రష్యాలో కరోనా ఓ రేంజిలో విజృంభిస్తోన్న ఆ దేశ రాజధాని మాస్కోలో రోజుకు 40 వేలకు పైగా టెస్టులు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో పరిస్థితి ఇంకా విషమంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి తమ దేశంలో కొత్త దశకే కాకుండా కఠిన దశకు చేరిందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశను తాము ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై సమాలోచనలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దేశంలో కరోనా విస్తృతిని చూస్తుంటే... ఆ వైరస్ రష్యాలో తనదైన శైలి విశ్వరూపం చూపే ప్రమాదం ఉందని, దానిని ఎదుర్కొనే దిశగా అడుగులు వేయక తప్పదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా పుతిన్ వ్యాఖ్యలు చూస్తుంటే... అమెరికా తరహాలోనే రష్యాలోనూ కరోనా వైరస్ తనదైన శైలి విలయాన్ని చూపే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.