Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ చెప్పిన రష్యా .. మరో వ్యాక్సిన్ సిద్ధం !
By: Tupaki Desk | 24 Sept 2020 4:02 AMకరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. దీనితో కరోనా ను అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ సమయంలో రష్యా ఇప్పటికే తాము స్పుత్నిక్ వ్యాక్సిన్ ను తీసుకుని వస్తున్నామని చెప్పిన సంగతి చేసింది. చాలా మంచి ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. ఈ సమయంలోనే రష్యా మరో కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ డెవలప్ చేస్తున్న ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ ను అక్టోబర్ 15 నాటికి తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ వెల్లడించింది.
రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి మీద ప్రపంచ వ్యాప్తంగా ఆశలు పెట్టుకున్నారు. ఈ వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తాజాగా రష్యానే ప్రకటించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఈ సైడ్ ఎఫెక్స్ ను తాము ముందుగానే ఊహించామని కూడా ఆయన చెప్పారు. ఒకటిన్నర రోజుల్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోయాయని రష్యా క్లారిటీ ఇచ్చింది.
మూడోదశ క్లినికల్ ట్రయల్స్ భాగంగా 40 వేల మందికి టీకా ఇవ్వనుంది. ఇటీవల రష్యాలో 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు వేశారు. త్వరలోనే వారికి రెండో డోసును వేయనున్నారు. ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పింది. భారత్ లో స్పుత్నిక్-V వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ ఆర్ డీఐఎఫ్ తెలియజేసింది. దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టనున్నామని.. ఇవి విజయవంతమైతే నవంబర్ తొలి వారానికల్లా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని అభిప్రాయపడింది.