Begin typing your search above and press return to search.
భారత్ కు రష్యా మద్దతు: చైనా వివాదం నేపథ్యంలో ప్రకటన
By: Tupaki Desk | 19 Jun 2020 11:30 PM GMTకొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా చివరకు ఇటీవల ఘర్షణ వాతావరణం ఏర్పడి సైనికులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితికి చేరింది. ఈ క్రమంలో ఇంకా గాల్వన్‌లో చైనా వివాదాస్పద చర్యలకు పాల్పడుతోంది. దీనిపై భారత్‌తో తగువు పెట్టుకునేలా వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం భారత్ - చైనా మధ్య సరిహద్దు వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ సమయంలో రష్యా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా భారత్‌కు తన మద్దతును ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దులో జరుగుతున్న పరిణామాలను తాము గమనిస్తున్నట్లు రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఓ ప్రకటన చేశారు.
చైనా, భారత్ సమన్వయం పాటించాలని, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తేవడానికి ఇరు దేశాలూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారత్, చైనాలతో తమకు చాలా సన్నిహిత, పరస్పర సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే జూన్ 23వ తేదీన భారత్, రష్యా, చైనా విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. గాల్వన్ లోయ వద్ద భారత్, చైనాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
సరిహద్దుల్లో చైనా, భారత్ ఘర్షణలతో విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహణపై నీలిమేఘాలు అలుముకున్నాయి. ఈ సమావేశం వాయిదా పడుతుందనే ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశం మాత్రం షెడ్యూల్ ప్రకారమే జూన్ 23న సమావేశం జరుగుతుందని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ సమావేశానికి ఛైర్మన్‌గా రష్యా వ్యవహరిస్తోంది. ఈ సమావేశంలో భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో గాల్వన్ లోయ ఘర్షణ చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు వైరస్ వ్యాప్తి, ఆర్థిక సంక్షోభం తదితర అంశాలపై చర్చకు రానున్నాయి.