Begin typing your search above and press return to search.

ఆగస్టు 12న రష్యా వ్యాక్సిన్ విడుదల.. అమెరికా అనుమానం

By:  Tupaki Desk   |   9 Aug 2020 11:43 AM GMT
ఆగస్టు 12న రష్యా వ్యాక్సిన్ విడుదల.. అమెరికా అనుమానం
X
ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనాకు మందు లేదా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. కేసులు.. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఈ సమయంలో రష్యా దేశం కీలక ప్రకటన చేసింది. కరోనాకు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఆగస్టు 12న ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది.

అయితే ఈ ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది. వ్యాక్సిన్ ను అన్ని రకాలుగా పరీక్షించి ఫలితాలు నిర్ధారించుకున్నాకే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు అంటోని ఫౌచీ వ్యాఖ్యానించడం విశేషం.

ఈ వ్యాక్సిన్ ను గమలేయా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. తొలి దశలో మెడికల్ సిబ్బంది, వయో వృద్ధులకు ఈ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు.

గత ఏప్రిల్ లోనే ఈ టీకా తయారీని రష్యా ప్రారంభించింది. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వలంటీర్లలో వ్యాధి నిరోధక శక్తి వచ్చిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసే పనులను సెప్టెంబరులో ప్రారంభించనున్నామని రష్యా తెలిపింది.