Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాలను భయపెడుతున్న ‘రష్యా’ సునామీ ఆయుధం

By:  Tupaki Desk   |   15 July 2022 2:30 AM GMT
ప్రపంచ దేశాలను భయపెడుతున్న ‘రష్యా’ సునామీ ఆయుధం
X
ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని యుద్ధాలతో అస్తవ్యవస్థం చేస్తున్న రష్యా మరో ఉపద్రవానికి రెడీ అయ్యిందంటే ఔననే సమాధానం వస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా.. తమకు కొరకరాని కొయ్యలుగా మారిన నాటోదేశాలు, అమెరికాను సవాల్ చేసేందుకు ఏకంగా ‘సునామీ’ ఆయుధాన్ని సముద్ర గర్భంలో రహస్యంగా దించిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రపంచ నౌకదళ చరిత్రలో గత వారం అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రష్యా తయారు చేసిందనంటున్నారు. సముద్రంలోని అత్యంత లోతుల్లో రహస్యంగా ఉండి.. సముద్ర అలలనే ఆయుధంగా మార్చి శత్రుదేశం తీరప్రాంత నగరాలపై సునామీ వలే ప్రయోగించగల ‘కే-329 బెల్గోరోడ్’ జలాంతర్గామిని సముద్ర జలాల్లో రహస్యంగా ప్రవేశపెట్టిందని సమాచారం.

రష్యాకు అత్యంత కీలకమైన ‘కోలా ద్వీపకల్పానికి సమీపంలోని తెల్ల సముద్రంలో రష్యా దీన్ని ప్రవేశపెట్టిందని సమాచారం. 604 అడుగుల పొడువున్న ఈ సబ్ మెరైన్ ప్రపంచంలోనే భారీదని నిపుణులు చెబుతున్నారు. దీనికి అణు టార్బిడో పొసైడాన్ ను ప్రయోగించేలా ఏర్పాట్లు చేశారు. గత ఏడాదియే తొలిసారి ఇది రహస్యంగా సముద్రంలోకి ప్రవేశించిందని చెబుతున్నారు. నల్ల సముద్రంలో ఉన్న అమెరికా, బ్రిటన్ నౌకలను దెబ్బతీస్తుందని భయపడ్డారు. కానీ ఈ ఏడాది జనవరిలో సముద్రంలో పరీక్షలు పూర్తి చేసుకుందని రష్యా వర్గాలు తెలిపాయి.

ఈ సబ్ మెరైన్ సైంటిఫిక్ రీసెర్చ్ లకు, లోతైన ప్రదేశాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సబ్ మెరైన్ కు అనుబంధంగా మరో చిన్న అణుశక్తి సబ్ మెరైన్ కూడా ఉంటుంది. సముద్రంలోని అత్యంత లోతుల్లో ఉండే కేబుల్స్ ను ధ్వంసం చేసేందుకు బెల్గోరోడ్ ను ఉపయోగించవచ్చు.

పశ్చిమ దేశాల కమ్యూనికేషన్లను ఈ సబ్ మెరైన్ తీవ్రంగా దెబ్బతీయగలదని పశ్చిమ దేశాలు పేర్కొన్నాయి. కోవర్టు ఆపరేషన్లకు, సమాచార తస్కరణకు దీనిని ఉపయోగించే అవకాశం ఉంది. 97 శాతం ఇంటర్నెట్ ట్రాఫిక్ తోపాటు రోజుకు 10 ట్రిలియన్ డాలర్లు విలువైన లావాదేవీలు ఈ అండర్ వాటర్ కేబుల్స్ పై ఆధారపడి ఉన్నాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సబ్ మెరైన్ ను గేమ్ ఛేంజర్ అని అభివర్ణించాడు. అణు టార్బిడోలు ఇందులో ఉంటాయి. ఈ ఆయుధాన్ని రష్యా ప్రతిదాడికి ఉపయోగిస్తుంటుంది. తీరప్రాంతంలోని లక్ష్యాలపై దాడికి వినియోగిస్తారు. ఆయా లక్ష్యాలపైకి వెళ్లి అణు పేలుడు జరుపుతాయి. ఫలితంగా భారీ నీటి అలలు సునమా వలే ఆ లక్ష్యాలపై పడుతాయి. దీంతో తీర ప్రాంతంలోని ప్రత్యర్థి దేశాల నగరాలు, పారిశ్రామికప్రాంతాలు, సముద్రంలోని బ్యాటిల్ గ్రూపులు నాశనం అవుతాయి. దీంతో దీన్ని రష్యా సునామీ ఆయుధంగా అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అణు సబ్ మెరైన్ ను తయారు చేసి రష్యా ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.