Begin typing your search above and press return to search.

రష్యా, ఉక్రెయిన్, బెలారస్..: మూడు దేశాల మధ్య నలిగిపోతున్న ఆ గ్రామం..

By:  Tupaki Desk   |   28 April 2022 2:30 AM GMT
రష్యా, ఉక్రెయిన్, బెలారస్..: మూడు దేశాల మధ్య నలిగిపోతున్న ఆ గ్రామం..
X
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఈ భీకర పోరుతో ఎందరో సైనికులు, పౌరులు వీరమరణం పొందారు. యుద్ధ వాతావరణాన్ని తట్టుకోలేక చాలా మంది ఉక్రెయిన్ వాసులు ఇతర దేశాలకు తరలిపోయారు. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య బెలారస్ వేదికగా శాంతి చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం అయినట్లే అయ్యాయి. కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్లమధ్య సాగుతున్న పోరుతో బెలారస్ దేశం కూడా నలిగిపోతుంది. ఈ దేశంలోని ఓ గ్రామంలో బాంబులు పడుతుండడతో ఏ దేశం దాడి చేస్తుందో తెలియక తికమక పడుతున్నారు.

ఉక్రెయిన్, రష్యా, బెలారస్ ను కలిపే గ్రామం సెంకివ్కా. ఉక్రెయిన్, రష్యాలు యుద్ధం చేసుకుంటే ముందుగా నష్టపోయింది ఈ గ్రామమే. ఈ గ్రామం నుంచి రష్యా సైనికులు ఏప్రిల్ మొదటి వారంలోనే వెళ్లిపోయారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఇప్పటికీ గ్రనేట్ దాడులు సాగుతున్నాయి. ఉక్రెయిన్ లోకి చొచ్చుకుపోవాలంటే రష్యాకు ఈ గ్రామమే ప్రధాన మార్గం అయితే యుద్ధం కారణంగా ఈ గ్రామం నుంచి యుద్ధ ట్యాంకులు వెళ్లడంతో రోడ్లు అధ్వాన స్థితికి చేరాయని స్థానికులు వాపోతున్నారు. ఉత్తర ఉక్రెయిన్ నగరం చెర్నేహీవ్, రాజధాని కీవ్ పై దాడి చేసేందుకు రష్యా సేనలు ఈ గ్రామం గుండా వెళ్లారు.

సెంకివ్కా గ్రామంలో దాదాపు 200 మంది ప్రజలు ఉండేవారు. కానీ ఫిబ్రవరి 24న రష్యా మొదలుపెట్టిన యుద్ధంతో ఈ గ్రామంలోనే మొదటి రాకెట్ పడింది. ఆ తరువాత ఈ గ్రామం నుంచి ఆకాశంలో ఎగురుతున్న విమానాలు, వీధుల నుంచి భారీగా వాహనాలు తిరుగుతుండడాన్ని గమనించామని గ్రామానికి చెందిన నివా అనే వ్యక్తి మీడియాకు తెలిపారు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో క్లస్టర్ బాంబులపై నిషేధం ఉంది. కానీ రష్యా, ఉక్రెయిన్ల మాత్రం ఈ బాంబులను ఉపయోగించాయి. అందుకు ఈ గ్రామంలో పడ్డ మిస్సైల్సే చెప్పవచ్చు అని రష్యా మీడియా తెలిపింది.

రెండో ప్రపంచ యుద్ధంలోనూ సెంకివ్కా బాధిత గ్రామమే. 1930లో ఈ గ్రామం నుంచి జర్మనీ సైనికులు వెళ్లేవారని అక్కడి వారు చెబుతున్నారు. ఆ సమయంలో ఆహారాన్ని ముందే తయారు చేసుకొని రహస్య ప్రదేశాల్లోకి వెళ్లేవాళ్లం. అప్పుడు భారీ యుద్ధ సామాగ్రితో జర్మనీ సైనికులు వెళ్లే వారని లిథియా అనే గ్రామస్థుడు తెలిపాడు. ఆ సమయంలో యుద్ధ భయంతో పరుగెత్తాను. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అని ఆయన పేర్కొంటున్నాడు. యుద్ధం వల్ల లాభం లేదని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత మాకేం లాభం జరిగిందని ఆయన అంటున్నాడు.

ఇదిలా ఉండగా 2014లో క్రిమియాపై రష్యా దాడి చేసిన సమయంలో ఈ మూడు దేశాల సరిహద్దులు తెరిచే ఉండివి. అంతేకాకుండా మూడు దేశాలు కలిసి ఐక్యతా సంబరాలు కూడా చేసుకున్నారు. మూడు కలిసే చోట 'త్రీ సిస్టర్స్' అనే స్మారకం కూడా ఉంది. ఇక 2014 తరువాత సెంకివ్కా మీదుగా సరిహద్దులు దాటడం కష్టమైపోయింది. ఇప్పుడు మరింత కష్టంగామారింది. అయితే బెలారస్ తో రష్యా, ఉక్రెయిన్లకు మంచి సంబంధాలు ఉండడంతో బంధువులు ఏర్పడ్డారు. కానీ యుద్ధ వాతావరణంతో ఎక్కడివారు అక్కడే మిగిలారు.