Begin typing your search above and press return to search.
పుతిన్ యుద్ధోన్మాదానికి ‘రష్యన్’ కుబేరులు బలి
By: Tupaki Desk | 2 March 2022 4:07 AM GMTయుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కన్నుమిన్ను కానరావడం లేదు. ఇప్పుడు పుతిన్ వల్ల రష్యన్ బిలియనీర్లు బలి అయిపోతున్నారు. ఆర్థిక ఆంక్షలతో కోట్లలో నష్టపోతున్నారు.
ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా వెలుపల భారీగా ఆస్తులు కలిగి ఉన్న రష్యన్ బిలియనీర్లు బిక్కుబిక్కుమంటున్నారు. తమ వ్యాపార సామ్రాజ్యాలకు ఎక్కడ బీటలు వారుతాయోనని తమ ఆస్తులు జప్తు చేస్తారని భయం భయంగా గడుపుతున్నారు.
ప్రపంచం మొత్తం వారిస్తున్నా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యన్ సైనిక దళాల తీరుతో ఉక్రెయిన్ లోని నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. రష్యా తీరును నిరసిస్తూ అమెరికా, యూరోపియన్ యూనియన్ తోపాటు అనేక దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి.
వీటి ప్రభావం రష్యన్ బిలియనీర్లపై భారీగా పడనుంది. ఆర్థిక ఆంక్షల వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యే రష్యన్ కుబేరుల్లో ఈ నలుగురు ముందు వరుసలో ఉన్నారు.
రష్యన్ మెటల్ టైకూన్ పేరున్న అలిషర్ ఉస్మానోవ్ 14 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. అమెరికా ఫేస్ బుక్ లో ఈక్ష్న భారీగా పెట్టుబడులు పెట్టారు. 300 మిలియన్ డాలర్ల ఎస్టేట్స్ ను లండన్ లో కలిగి ఉన్నారు. వాటిపై ఇప్పుడు ఆంక్షలున్నాయి. నిండా మునిగేలా ఉన్నారు.
రష్యాలో ప్రైవేట్ బ్యాంకర్ గా ఫేమస్ మిఖైల్ మరాటోవిచ్ ఫ్రిడ్ మ్యాన్ ఉన్నారు. ఇతడి సంపద 11.4 బిలియన్ డాలర్లు. ఈయనకు రష్యా వెలుపల విలువైన ఆస్తులున్నాయి. మిఖైల్ కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
రష్య దేశంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యాపారవేత్తల్లో పీటర్ అవెన్ ఒకరు. ఆల్ఫా బ్యాంక్ గ్రూప్ ను నిర్వహిస్తున్న ఈయన సందప 4.3 బిలియన్ డాలర్లు. ఈయనకు అనేక వ్యాపారాలు ఇతర దేశాల్లో ఉన్నాయి. రష్యా దాడితో ఈయన ఆస్తులకు సెగ ఏర్పడింది.
రష్యాలో స్టీలు ఉత్పత్తిదారుల్లో దిగ్గజ కంపెనీ పారిశ్రామిక వేత్త మర్దాషోవ్. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ కంపెనీలు ఈయన సొంతం. రష్యా దాడితో ఈయన కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. నికర సంపద 29 బిలియన్ డాలర్లుగా ఉంది. అదిప్పుడు ప్రమాదంలో పడింది.