Begin typing your search above and press return to search.
యుద్ధానికి నెలరోజులు..: మరో లక్ష్యం దిశగా రష్యా..
By: Tupaki Desk | 26 March 2022 2:09 AM GMTచిన్నపాటి యుద్ధంతో ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవచ్చని భావించిన రష్యాకు.. ఉక్రెయిన్ ప్రతిఘటన ఎదురుదెబ్బె తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే యుద్ధం ప్రారంభమై నెలరోజులు పూర్తి అయినా ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించుకోలేకపోయింది. అయితే ఉక్రెయిన్లోని ప్రధాన కేంద్రాలను దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచింది.
అటు ఉక్రెయిన్ ప్రతిఘటనతో రష్యా సైతం తీవ్రంగా నష్టపోయింది. అయితే తాజాగా తొలిదశ యుద్ధం ముగిసిందని, తరువాత లక్ష్యంపై గురిపెడతామని రష్యా అధికారిక ప్రకటన చేసింది. 30వరోజు ఉక్రెయిన్లోని ఖర్కివ్ సహా పలు నగరాల్లో దాడులు చేయడంలో నలుగురు చనిపోయారు. కీవ్ వెలుపల ఉన్న ఉక్రెయిన్ ప్రధాన ఇంధన డిపోను క్షిపణులతో ధ్వంసం చేసినట్లు రష్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే రష్యా పెట్టిన నెక్ట్స్ టార్గెట్ ఏంటి..? లక్ష్యాంగా దేనిని పెట్టుకుంది..?
రష్యా చేస్తున్న దురాక్రమణను నెలరోజుల పాటు ఉక్రెయిన్ సైన్యంతో పాటు ప్రజలు ఎదుర్కొన్నారు. ఒకటి, రెండు రోజుల్లో బాంబులు కురిపించి ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని చూసిన రష్యాకు ఉక్రెయిన్ తిరుగుబాటుతో నెలరోజుల పాటు యుద్ధం చేయాల్సి వచ్చింది.
నాటో సభ్యత్వ దేశం కానందున ఉక్రెయిన్ కు సాయం చేయలేమని చెప్పిన నాటో దేశాలు ఆ తరువాత ఆయుధాలు సరఫరా చేయడంతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించడానికి కారణమైంది. అటు రష్యాపై ఈయూ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యాను తమ దారికి తెచ్చుకోవాలని చూశారు. కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా యుద్ధం కొనసాగిస్తోంది. దీంతో ఇటు పశ్చిమ దేశాలు సైతం ఉక్రెయిన్ కు ధీటుగా పోరాడేందుకు ఉక్రెయిన్ కు అండగా నిలవడంతో ఆ దేశం వెనక్కి తగ్గడం లేదు.
అయితే రష్యా మాత్రం నెలరోజులు పూర్తయిన సందర్భంగా మరో ప్లాన్ వేసేందుకు రెడీ అవుతోంది. తొలిదశ యుద్ధం ముగిసిందని చెప్పిన రష్యా నెక్ట్స్ డాన్ బాస్ ప్రాంతంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 16,100 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అలాగే 561 యద్ధ ట్యాంకులు, 1625 సాయుధ వాహనాలను కోల్పోయామని తెలిపింది.
అమెరికా, ప్రభుత్వేతర సంస్థల నుంచి సాయం అందుతోంది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థులకు పొలాండ్ సాయం చేస్తోంది. అటు అమెరికా కూడా ఈ విషయంపై ఆలోచిస్తోంది. కీవ్ కు తూర్పున 35 కిలోమీటర్ల వరకు పట్టణాలు, రక్షణ స్థావరాలను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
అటు రష్యా సైతం తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొంది. ఇప్పటివరకు 1,351 మంది మాస్కో బలగాలు చనిపోయినట్లు రష్యా మిలటరీ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ప్రకటించారు. మరో 3,825 మందికి గాయాలైనట్లు తెలిపింది. ఉక్రెయిన్ కు పరోక్షంగానైనా సాయం చేస్తున్న నాటోకూటమి చర్యలతో 7 వేల నుంచి 15 వేల మంది రష్యా సైనికులు మరణించినట్లు తెలుస్తోంది.
ఐరోపా పర్యటనలో భాగంగా అమెరియా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల పొలండ్ కు వచ్చారు. ఈ సందర్భంగా పోలండ్-ఉక్రెయిన్ సరిహద్దుల్లోని సైనికులతో మాట్లాడారు. పొలాండ్ కు వలస వెళ్తున్న ఉక్రెయిన్ శరణార్థుల విషయంపై చర్చించారు.