Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ యుద్ధం: కన్నీళ్లు తెప్పించే వీడియో.. వైరల్
By: Tupaki Desk | 11 July 2022 12:30 AM GMTఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధకాండ ఇంకా రగులుతూనే ఉంది. ఉక్రెయిన్ సైనికులు యుద్ధం కోసం వెళ్లి నెలలు అవుతోంది. వారి కుటుంబాలకు దూరంగా మాతృభూమి కోసం వారంతా పోరాడుతున్నారు.ఈ సమయంలో సైనిక సిబ్బంది ఇంటికి తిరిగి వచ్చి వారి కుటుంబాన్ని కలుసుకున్న వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది.
ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ సలహాదారు అంటోన్ గెరాష్చెంకో తాజాగా రష్యా దళాతతో పోరాడిన తర్వాత ఒక ఉక్రేనియన్ సైనికుడు ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి అతడు కుటుంబాన్ని కలుసుకున్న తరుణంలో భావోద్వేగానికి గురయ్యాడు. అప్పుడు తీసిన వీడియోను అంటోన్ పంచుకోగా వైరల్ అయ్యింది. ఈ ఎమోషనల్ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఒక సైనికుడు తన కుటుంబాన్ని ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొని నెలల తర్వాత కలుసుకోవడం ఈ వీడియో సారాంశం. అయితే ఆ సైనికుడు వచ్చాడని అతడి కూతురుకు తెలియదు. కూతురికి చెప్పకుండా సైనికుడు వచ్చాడు. దీంతో సైనికుడి భార్య తమ కూతురు కళ్లు మూస్తూ ఇంట్లోకి తీసుకొస్తుంది. తండ్రిని యుద్ధం తర్వాత చాలా రోజులకు చూసిన కుమార్తె కన్నీళ్లు పెట్టుకొని 'డాడీ' అంటూ ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్చేసింది. తండ్రిని పట్టుకొని ఏడుస్తూనే ఉండిపోయింది. తండ్రిని చూసిన ఆనందంలో కూతురు పొందిన సంతోషానికి కన్నీళ్ల రూపంలో ఆనందభాష్పాలు వచ్చాయి.
యుద్ధం తర్వాత పరిస్థితులు.. సైనికుల జీవితాలు కళ్లకు కట్టే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ వీడియోను రీట్వీట్చేసి ఉక్రెయిన్ కు మద్దతు తెలిపారు.
ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం గత ఐదు నెలలుగా కొనసాగుతోంది. యుద్ధంలో వందలు, వేల మంది ఉక్రేనియన్లు ఆశ్రయం కోసం పొరుగు దేశాలకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఐరోపాలో మానవతా సంక్షోభానికి ఇది దారితీసింది. ప్రస్తుతం ఈ వీడియో ఉక్రెయిన్ లో మానవ సంబంధాలకు మచ్చుతునకగా మారింది.