Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ కు అండగా 40 వేల నాటో బలగాలు..
By: Tupaki Desk | 25 March 2022 5:32 AM GMTరష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. మొన్నటి వరకు ఉక్రెయిన్ కేవలం ఒంటరి పోరాటమే అని భావించారు. కానీ ఇప్పుడు నాటో దళాలు ఉక్రెయిన్ కు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నాయి. యుద్ధ ప్రారంభంలో ఈయూ దేశాలు నాటో దళాలు దింపమని ప్రకటించాయి. అయితే ఉక్రెయిన్ పై రష్యా దూకుడు ప్రభావం తగ్గించకపోవడంతో పాటు యుద్ధం కొనసాగిస్తుండడంపై ఇప్పుడుఉక్రెయిన్ కు అండగా నిలిచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే రష్యాను ఆర్థికంగా దెబ్బ తీసిన పశ్చిమ దేశాలు ఇప్పుడు ఇక నాటో దళాలు రంగంలోకి దిగితే యుద్ధం ఎలా ఉంటుందోనని ప్రపంచ వ్యాప్తంగా చర్చలు ప్రారంభమయ్యాయి.
ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో శాంతి చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను ఈయూ దేశాలు కోరాయి. కానీ రష్యా మాత్రం ఆగకుండా యుద్ధం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలన్నీ ఇప్పటికే ధ్వంసం చేసింది. అయితే రష్యా దురాక్రమణపై నాటో దేశాలు అప్రమత్తమయ్యాయి. రష్యా నుంచి ఉక్రెయిన్ ను కాపాడేందుకు ఆచరణాత్మక మద్దతు అందిస్తామని ప్రకటించాయి. రసాయన, జీవ, రేడియోలాజికల్, అణ్వాయుధాల బెదిరింపును తిప్పికొట్టేలా ఉక్రెయిన్ కు అండగా ఉంటామని స్పస్టం చేశాయి.
ఈ మేరకు ఇటీవల నాటో దేశాలు బ్రస్సెల్స్ లో సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన చర్యలను ఖండించారు. ఇప్పటికే రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధింగా.. మిగతా విషయాల్లో కూడా రష్యాను కట్టడి చేయాలని నిర్ణయించాయి. రష్యా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా దీర్ఘకాలిక రక్షణ ప్రణాళికలను యాక్టివేట్ చేయాలని నిర్ణయించాయి. తమ ఉక్రెయిన్ తూర్పు భాగాన్ని మరింత బలోపేతం చేయాలని నాటో దేశాలు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా 40 వేల మందితో కూడి నాటో రెస్పాన్స్ ఫోర్స్ దళాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు రష్యా దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కు అమెరికా భారీ సాయాన్ని ప్రకటించిది. ఆర్థిక తోడ్పాటు కింద ఒక బిలియన్ డాలర్లను అందించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఉక్రెయిన్ శరణార్థులకు దేశంలోకి అనుమతించేలా ప్రణాళిక వేసింది. ఇక యూరోపియన్ డెమొక్రటిక్ రెసెలియన్స్ ఇనిఫియేటివ్ ను ప్రారంభించేందుకు 320 మిలియన్ డాలర్లను కేటాయించారు. పొరుగు దేశలలో మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ అండగా ఉండేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగ నాటో దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే హంగేరి, బల్గేరియా, స్టోవేకియా లల్లో నాలుగు అదనపు మల్టీనేషనల్ యుద్ధ బృందాలను ఏర్పాటు చేస్తన్నట్లు ప్రకటించాయి. తమ మిత్ర దేశాల భద్రతను నిర్దారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.