Begin typing your search above and press return to search.
హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి రష్యా ఔట్
By: Tupaki Desk | 8 April 2022 7:32 AM GMTరష్యా కు ఐక్య రాజ్య సమితి లో భారీ షాక్ తగిలింది. ఉక్రెయిన్ లో తమ బలగాలతో విరుచుకు పడ్డ రష్యా కు తగిన గుణపాఠం చెప్పేందుకు ఐరాస ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే మానవ హక్కుల పరిరిక్షణ మండలి నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. ఉక్రెయిన్ నగరాల్లో రష్యా సైనికులు పాల్పడిన దురాగతాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.
ముఖ్యంగా బుచాతో పాటు కీవ్ పట్టుకు, పరిసర ప్రాంతాల్లో రష్యన్ సైనికుల నరమేధానికి సంబంధించిన ఆధారాలు బయట పడడంతో ప్రపంచ వ్యాప్తంగా రష్యా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మానవ హక్కుల కమిషన్ నుంచి రష్యాను బహిష్కరించాలని కోరుతూ ఐరాస సాధారణ సభలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. గురువారం జరిగిన యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో 193 మంది సభ్యులు ఉండగా... 93 మంది అమెరికా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. 24 మంది వ్యతిరేకంగా ఓటేయగా.... 58 దేశాలు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. అయితే ఇందులో భారత్ కూడా ఉంది.
ఈ ఓటింగ్ లో మూడింట రెండు వంతుల మెజారిటీ అమెరికా తీర్మానానికి అనుకూలంగా రావడంతో ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యా బహిష్కరణకు గురైంది. ఇదిలా ఉండే ఐరాస సాధారణ సభలో రష్యాకు అనుకూలంగా చైనా, మాస్కో, మిత్ర పక్షం, ఇరాన్ మాజీ సోవియేట్ రిపబ్లిక్ ఆప్ కజకిస్తాన్ కమ్యూనిస్ట్ క్యూబా, అలాగే బెలారస్, సిరియాలు ఓటు వేశాయి. మరోవైపు భారత్ సహా 58 దేశాల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.
వీటిలో భారత్, బ్రెజిల్ మెక్సికో, సెనెగల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ఉన్నాయి. అయితే ఓటింగ్ కు దూరంగా ఉండటం పై భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.... అమాయక మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు, దౌత్యం మాత్రమే అచరణీయమైన ఎంపికగా ప్రబలంగా ఉండాలని తెలిపారు.
ఇదిలా ఉండగా 2011లో తొలిసారిగా లిబియాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు... చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికాతో పాటు అదనంగా జర్మనీ కూడా ఉంది.
ఈ క్రమంలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల్లో ఐరాస లోని ఒక ఉన్నత మండలి నుండి తొలగించబడిన తొలి దేశం రష్యా గా నిలిచింది. మానవ హక్కుల కమిషన్ నుంచి రష్యాను తొలగించడం పట్ల ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్ లో స్పందించారు. మానల హక్కులను కాపాడే లక్ష్యంతో ఉన్న యూఎన్ సంస్థల్లో యుద్ధ నేరస్థులకు చోటు లేదని అన్నాడు. అలాగే సంబంధిత యూఎన్జీఏ తీర్మానానికి మద్దతిచ్చిన చరిత్రకు మంచి వైపును ఎంచుకున్న అన్ని సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.