Begin typing your search above and press return to search.
భారీగా క్షీణించిన వృద్ధి.. అభివృద్ధి: వైరస్ దెబ్బకు రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
By: Tupaki Desk | 6 July 2020 12:30 AM GMTవైరస్ దెబ్బకు ప్రపంచంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. వృద్ధి.. అభివృద్ధి ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడు ఎరుగని తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. లాభాలు దేవుడెరుగు అసలు వ్యాపారం అనే మాట లేదు. ఈ పరిస్థితి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా తీవ్రంగా ఉంది. దీని ప్రభావం రష్యాపై తీవ్రంగా ఉంది.
దానికి కారణం వైరస్ తో పాటు చమురు ధరలు భారీగా పడిపోవడంతో రష్యా తీవ్రంగా దెబ్బతిన్నది. సాధారణంగా రష్యా బడ్జెట్ లో 40 శాతం వరకు చమురు - గ్యాస్ రంగం నుంచి వచ్చే పన్నులపై ఆధారపడి ఉంటుంది. మార్చి నుంచి రష్యన్ సంస్థలు నష్టపోవడం మొదలైంది. గతంలో ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోని వారు కూడా ఇప్పుడు దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం రష్యన్ ప్రజలపై తీవ్రంగా ఉంది. కొన్ని కుటుంబాలు అయితే ఆహారం కూడా కొనలేని పరిస్థితి. చాలామంది నిరాశ్రయిలయ్యారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారు.
దీనిపై రష్యన్ ఫెడరల్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ ఓ అంచనా వేసింది. దీని ప్రకారం మే చివరి నాటికి 4.5 మిలియన్ల మందికి ఉద్యోగం లేదని ఓ అంచనాగా తెలిపింది. మార్చి నుంచి ఇది 85 శాతం పెరిగిందని పేర్కొంది. వైరస్ కు ముందు నిరుద్యోగం 1.3 మిలియన్లుగా ఉందని నివేదించింది. వైరస్ మొదలైన తర్వాత ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 5.8 శాతంగా ఉండగా ప్రస్తుతం 6.1 శాతానికి పెరిగింది. అమెరికాలో జూన్ నిరుద్యోగిత రేటు 11.1 శాతానికి తగ్గింది. ఏప్రిల్ నెలలో ఇది 14.7 శాతంగా ఉంది.
దీంతోపాటు పారిశ్రామిక ఉత్పత్తి పై కూడా అదే స్థాయిలో ప్రభావం పడింది. మే నెలలో రష్యా ఇండస్ట్రియల్ ఔట్ పుట్ 9.6 శాతానికి పడిపోయింది. ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ భారీగా దెబ్బతిన్నది. గతేడాదితో పోలిస్తే మే నెలలో 42.2 శాతం పడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.5 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. రష్యాలో వేలు, లక్షలాది వ్యాపారాలు దెబ్బతిన్నాయి.