Begin typing your search above and press return to search.

రష్యా బలగాల ప్లాన్ మార్పు.. ఆవేదనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు

By:  Tupaki Desk   |   20 May 2022 11:30 PM GMT
రష్యా బలగాల ప్లాన్ మార్పు.. ఆవేదనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు
X
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా ఇప్పటికీ వెనక్కి తగ్గకుండా ఒక్కో నగరాన్ని కైవసం చేసుకుంటూ ముందుకెళుతోంది. బాంబులు, మిస్సైల్స్ అటాక్ చేస్తూ రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. అటు ప్రాణ నష్టంతో పాటుగా భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది.

తాజాగా ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ గురువారం రాత్రి మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతం డోన్ బాస్ ప్రాంతాన్ని రష్యా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆరోపించారు. రష్యా దాడులు బాంబు దాడులను తీవ్రతరం చేశాయని తెలిపారు. రష్యా బలగాలు అనేక మంది ఉక్రేనియన్లను చంపి.. వీలైనంత మేరకు సంస్థలను నాశనం చేసి ఎక్కువ నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు తూర్పున ఉన్న ఖార్కివ్ ప్రాంతాన్ని రష్యా నుంచి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అగ్నేయంలో ఉన్న డాన్ బాస్ లో రష్యా మరింత ఒత్తిడిని పెంచడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

తాజాగా డోన్ బాస్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడుల్లో 12 మంది ఉక్రేనియన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఒడెసా, సెంట్రల్ ఉక్రెయిన్ నగరాలపై నిరంతరం దాడులు సాగుతున్నాయి. డోన్సాస్ పూర్తిగా నాశనమైందన్నారు. మరో వైపు ఉక్రెయిన్ లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి 3811 ఉక్రేనియులు మృతిచెందగా.. 4278 మంది పౌరులు గాయపడ్డారని యూఎన్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఓ ప్రకటనతో తెలిపారు.

ఇక ఉక్రెయిన్ కు మద్దతుగా నార్వే దేశ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సాండ్రా అండర్సన్ ఈరా యుద్ధ రంగంలోకి దిగారు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తరుఫున పోరాడుతున్నారు.

ఉక్రెయిన్లోని ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ రష్యా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలైన కీవ్ ను ఇప్పటికే చేజిక్కించుకోగా.. మేరియుపోల్ కూడా రష్యా వశమైనట్లే కనిపిస్తోంది. రష్యా సేనలు మేరియుపోల్ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇక్కడున్న అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోలేకపోయారు. తాజాగా దానీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇక పుతిన్ సేనలు కొత్త ప్రాంతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే ఊపులో రష్యా ముందుకు వెళ్తే రాను రాను ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం రష్యాకు ఏమంత పెద్ద పనికాదని విశ్లేషకులు భావిస్తున్నారు.