Begin typing your search above and press return to search.

ఐసిస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌వుతోంది

By:  Tupaki Desk   |   2 Jan 2017 10:30 PM GMT
ఐసిస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌వుతోంది
X
తన ఉగ్రవాద చర్యలతో ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న సంస్థ ఇస్లామిక్ స్టేట్ 2016 మాత్రం ఆ సంస్థకు కాళరాత్రిగా మిగిలింది. పలు దేశాలకు విస్తరించిన ఐఎస్ సామ్రాజ్యం.. 2016 చివరికల్లా సగానికిపైగా కూలిపోయింది. పలు దేశాలు కూటమిగా జరిపిన దాడులతో దాదాపు 50 వేల మంది జిహాదీలు మృతి చెందారు. ఇరాక్ - సిరియాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటం, ప్రభుత్వ - సంకీర్ణదళాల భూతల - వైమానిక దాడులతో ఐఎస్ అతలాకుతలం అవుతోందని అంటున్నారు.

ఒకప్పుడు ఇరాక్ - సిరియాలో బలంగా పాతుకుపోయిన ఐఎస్‌ కు ఇటీవల గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. వ్యూహాత్మక ప్రాంతాలైన ఇరాక్‌ లోని ఫల్లూజా - రమడి - అన్బర్ - సిరియాలోని మన్బిజ్ - తాజా గా అలెప్పో వంటి ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను సంకీర్ణ దళాలు తరిమికొట్టాయి. మరోవైపు లిబియాలో తమ సామ్రాజ్యం విస్తరించాలని భావించినా డిసెంబర్ మొదట్లో సిర్ట్ పట్టణాన్ని కోల్పోవడంతో వారి ఆశలకు గండిపడింది. 2014 జూన్‌ లో దాదాపు పదివేల మంది ఇరాకీ సైనికులు - అమెరికా సాయంతో మొసూల్‌ ను ఐఎస్ నుంచి విముక్తికి భారీ యుద్ధం ప్రారంభించారు. ఇక్కడే ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ ఇస్లామిక్ రాజ్య స్థాపన ప్రకటన చేశారు. ఈ యుద్ధంలో సంస్థ భారీగా జిహాదీలను కోల్పోయింది.ఆ తర్వాత సిరియాలోని మరో ప్రధాన స్థావరమైన రక్కా ప్రభుత్వ బలగాల వశవడంతో ఇస్లామిక్ రాజ్యం అనే భావనకు అర్థం లేకుండా పోయిందని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఐఎస్‌ పై జరిపిన దాడుల్లో అమెరికా - బ్రిటన్ - రష్యా - పశ్చిమ దేశాలతోపాటు - టర్కీ - ఇరాన్ - ఇరాక్ - సిరియా దళాలు ప్రధాన పాత్ర పోషించాయి. సిరియాలోని అలెప్పో విముక్తే లక్ష్యంగా జరిపిన పోరాటంతో అక్కడి నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టారు. అమెరికా నివేదికల ప్రకారం 2014 లో 7 దేశాలకే పరిమితమైన ఐఎస్ కార్యకలాపాలు - 2015లో 13 దేశాలకు 2016లో 18 దేశాలకు విస్తరించింది. ఈజిప్ట్ - ఇండోనేషియా - మాలి - ఫిలిఫ్పీన్స్ - సోమాలియా - బంగ్లాదేశ్‌ లలోనూ వేళ్లూనుకుంటున్నది.

2016లో జరిగిన యుద్ధంలో 30 లక్షల మంది పౌరులను - 44,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఐఎస్ చెరనుంచి విడిపించినట్టు సంకీర్ణ దళాల కమాండర్ జనరల్ స్టీవ్ టౌన్‌ సెండ్ తెలిపారు. మొసుల్‌ పై యుద్ధంలో ఉగ్రవాదుల వ్యూహాలను బట్టి వారు తేలికగా లొంగేరకం కాదని అన్నారు. ప్రస్తుతం ఐఎస్ వెనక్కితగ్గినట్టు కనిపిస్తున్నా - బలగాన్ని పెంచుకొని మెరుపుదాడులకు దిగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/