Begin typing your search above and press return to search.

ఆ రష్యా జర్నలిస్ట్ చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేం

By:  Tupaki Desk   |   21 Jun 2022 10:30 AM GMT
ఆ రష్యా జర్నలిస్ట్ చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేం
X
ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధంలో ఎన్నో లక్షల మంది మృత్యువాత పడ్డారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. అభం శుభం తెలియని పసివాళ్లు.. తామెందుకు చనిపోతున్నామో తెలియకుండానే మరణించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం వల్ల ఎంతో మంతి పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వీరిని చూసి ప్రపంచమంతా అయ్యో పాపం అంటోంది. కానీ ఓ రష్యన్ జర్నలిస్టు మాత్రం పాపం అని అనుకోవడంతోనే సరిపెట్టుకోలేదు. వారి కోసం తనకు లభించిన నోబెల్ బహుమతిని వేలం పెట్టారు.

ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య యుద్ధంతో ఎంతో మంది చిన్నారులు వారి తల్లిదండ్రులను కోల్పోయారు. వారిని చూసి ప్రపంచమంతా కన్నీళ్లు పెట్టుకుంటోంది. కానీ వారి కోసం ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తోంది. కానీ ఉక్రెయిన్‌పై దాడి చేస్తోంది తమ దేశమని తెలిసీ.. తన దేశం వల్ల ఉక్రెయిన్‌లో ఎంతో మంది చిన్నారులు నిరాశ్రయులవ్వడం చూసిన ఓ రష్యన్ గుండె విలవిల్లాడింది.

రష్యన్ జర్నలిస్టు దిమిత్రి మురాతోవ్.. అభాగ్యులైన ఆ పిల్లల కోసం ఏదైనా చేసి.. తన దేశం చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించారు. అందుకే తనకు లభించిన నోబెల్‌ బహుమతిని వేలం పెట్టారు. ఊహించని రీతిలో.. పిల్లల కోసం దిమిత్రి చేస్తున్న పనిని కొనియాడిన వేలగుండెల ప్రార్థనలు ఫలించాయి. అతడి నోబెల్ బహుమతి రికార్డు స్థాయిలో అత్యధిక ధర 800 కోట్ల(103.5మిలియన్ డాలర్లు) పలికింది.

దిమిత్రి మురాటోవ్‌ 2021లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జర్నలిస్ట్ మరియా రెస్సాతో కలిసి నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. గతంలోని నోబెల్ వేలం రికార్డులు ఈ వేలంతో బద్దలయ్యాయి. 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని విక్రయించగా.. అప్పట్లో అత్యధికంగా 4.76డాలర్లు వచ్చాయి. హెరిటేజ్‌ వేలం కంపెనీ ఈ నోబెల్‌ ప్రైజ్‌ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్‌ అందజేస్తామని స్పష్టం చేసింది.

రష్యాలో 1999లో దిమిత్రి మురతోవ్ స్వతంత్ర పత్రిక నొవాయా గెజిటాను స్థాపించారు. ఆ పత్రికను మార్చిలో మూసేశారు. ఆ పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఆయన పనిచేశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశం లోపల, వెలుపల అతని వ్యూహాలపై విమర్శలు గుప్పించిన ఏకైక ప్రధాన వార్తాపత్రిక ఇది. ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో రష్యా తమ దేశంలోని పాత్రికేయులపై కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌లో చిన్నారుల సంక్షేమం కోసం ఆయన బహుమతిని వేలం వేయాలని నిర్ణయించారు. 5లక్షల డాలర్ల డబ్బును కూడా ఆయన చారిటీకి ఇచ్చేశారు. వేలంలో వచ్చిన సొమ్ము నేరుగా యూనిసెఫ్ అకౌంట్‌లోకి వెళ్తుందని.. ఆ సంస్థ పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేస్తుందని మురాతోవ్ తెలిపారు.