Begin typing your search above and press return to search.
పుతిన్ చచ్చిపోలేదు.. జబ్బు పడలేదు
By: Tupaki Desk | 17 March 2015 6:02 AM GMTరష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్‌పై వెల్లువెత్తుతున్న పుకార్లకు సంబంధించి అంశాలకు పుల్‌స్టాప్ పడినట్లే. గత పదిరోజులుగా కనిపించకుండా ఉండిపోయిన పుతిన్ తాజాగా దర్శనమిచ్చారు.
గత పదిరోజులుగా పుతిన్ కనిపించకపోవటంతో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆయన జబ్బు పడ్డారంటే.. మరికొందరు ఆయన మరణించి ఉంటారన్నారు. ఇంకొందరు ఆయన్ను నిర్భందంలోకి తీసుకున్నారని చెప్పుకున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి ఆయన ప్రేయసి స్విట్జర్లాండ్‌లో ప్రసవం అయ్యిందని ఆమెను చూసేందుకు పుతిన్ అక్కడకు వెళ్లారన్న వాదనలు కూడా వినిపించాయి.
ఇలాంటి పుకార్లకు తెర దించుతూ సోమవారం ఆయన బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడారు. పుకార్లు లేకపోతే మనకు విసుగొస్తుందంటూ సరదాగా వ్యాఖ్యలు చేసిన ఆయన.. తనపై వచ్చిన పుకార్లకు సటైరు వేశారు. ఆయన చలాకీతనం.. చూసిన వారు ఆయనకు ఏమీ కాలేదని.. అనారోగ్య ఛాయలు అస్సలు కనిపించలేదని చెబుతున్నారు. మరి.. పదిరోజుల పాటు పుతిన్ ఎక్కడికి వెళ్లినట్లు..?