Begin typing your search above and press return to search.
హెయిర్ స్టైల్ నచ్చక 8 మందిని చంపాడు..?
By: Tupaki Desk | 19 Dec 2015 4:18 AM GMTహెయిర్ స్టైల్ విషయంలో చోటు చేసుకున్న ఒక తగువులాట ఎనిమిది మంది ప్రాణాలు పోయేందుకు కారణం కావటం సంచలనం సృష్టిస్తోంది. మొదట చిన్నగా మొదలైన ఈ గొడవ కాసేపటికే పెద్ద గొడవగా మారిపోవటమే కాదు.. ఆరుగురు కన్నబిడ్డల్ని పొట్టనపెట్టుకున్న వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ భయానక ఘటన రష్యాలో చోటు చేసుకుంది.
రష్యాకు చెందిన ఓలెగ్ బోలోవ్ అనే వ్యక్తికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య తాజాగా గర్భవతి. తన ఆరేళ్ల కొడుక్కి కాస్త విభిన్నంగా ఉండేలా హెయిర్ స్టైల్ మార్చింది. ఇది ఓలెగ్ కు ఏ మాత్రం నచ్చలేదు. ఈ విషయంపై భార్యను నిలదీశాడు. చిన్నగా మొదలైన గొడవ అంతకంతకూ పెరిగిపోయింది. ఆవేశం హద్దులు దాటి.. బోలోవ్ విచక్షణను కోల్పోయాడు. తొలుత గర్భవతి అయిన తన భార్యను గొడ్డలితో నరికేశాడు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన పిల్లలు షాక్ తిన్నారు.
వారు దాన్లో నుంచి బయట పడేసరికే.. ఓలెగ్ ఆరుగురు పిల్లల్ని అత్యంత కిరాతకంగా చంపేశాడు. అనంతరం.. తల్లి నివసిస్తున్న ఇంటికి వెళ్లి ఆమెను హతమార్చాడు. అనంతరం వారి శవాల్ని ప్లాస్టిక్ సంచుల్లో కుక్కేసి.. కోర్టులో లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్న అతనికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆవేశంతో విచక్షణ కోల్పోవటమే కాదు.. అంతమందిని పొట్టన బెట్టుకున్న వైనం పలువురికి షాకింగ్ గా మారింది.