Begin typing your search above and press return to search.
విమానప్రమాదం...224 మంది మృతి
By: Tupaki Desk | 31 Oct 2015 6:10 PM GMTఎక్కేటప్పుడు వారంతా చాలా హుషారుగా విమానం ఎక్కారు. తమ పిల్లా పాపలతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో హాయిగా సెలవులు గడిపి ఇంటికి బయల్దేరిన వారు కేవలం 23 నిమిషాల వ్యవధిలోనే కనిపించని లోకాలకు వెళ్లిపోయారు. హాయిగా ఇళ్లకు చేరుకుంటామని భావించిన వారి ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోయాయి. ఈజిప్టులోని సినాయ్ దీవుల్లో రష్యా విమానం కుప్పకూలింది.ఈ ఘటనలోని ప్రయాణికుల్లోని 224 మందిలో ఏ ఒక్కరూ మిగల్లేదు. వారితో పాటు ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు. ఇందులో ముగ్గురు మినహా అందరూ రష్యన్లే. 17 మంది చిన్నారులున్నారు. తుళ్లుతూ పాడుతూ ఎంతో సరాదాగా టూరిస్టు స్పాట్‌ల్లో గడిపిన ఈ చిన్నారులంతా, చిధ్రమైన శరీరాల సరసన చేరడం అత్యంత విషాదకరం. ఇప్పటివరకు 150 మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగారు. డీఎన్‌ఏ పరీక్షలు అనంతరం ఆ మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తారు.
ఈజిప్టులో రష్యా విమానం కుప్పకూలడం ..ప్రాథమికదర్యాప్తు ప్రకారం సాంకేతిక లోపమే కారణమని ఈజిప్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. విమానంలో సాంకేతిక లోపం వల్లనే అది కుప్పకూలిపోయిందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఉత్తర సినాయ్ భద్రతా అధికారులు తెలిపారు. విమానం నిలువుగా కిందకుపడిపోవడంతో ఎక్కువ ప్రాంతంలో మంటలు చెలరేగాయని వారు భావిస్తున్నారు.
అయితే ఈజిప్టు నుంచి రష్యా వెళుతున్న రష్యా విమానాన్ని తామే కూల్చివేశామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఆండ్ సిరియా పేర్కొంది. రష్యాకు చెందిన ప్యాసింజర్ జెట్ విమానాన్ని ఈజిప్టులోని షెనాయ్ ప్రాంతంలో కూల్చివేసింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ మరణించారు.