Begin typing your search above and press return to search.
భారతీయులపై ఆ దేశాధినేత సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 6 Nov 2022 12:30 AM GMTభారతీయులపై రష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయులు చాలా ప్రతిభావంతులని ప్రశంసించారు. అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలు సాధించగల సమర్థత భారతీయులకు ఉందని పుతిన్ కొనియాడారు.
నవంబరు 4న రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రష్యా అధినేత పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తద్వారా తమ చిరకాల మిత్రదేశమైన భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
"భారత్‌ను చూడండి.. దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంతో మంది ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. దాదాపు 150 కోట్ల మందితో ఇప్పుడు భారత్ సమర్థవంతమైన దేశంగా ఉంది. అభివృద్ధిలో భారత్ కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు" అంటూ పుతిన్ భారతీయులపై తన ప్రేమను చాటుకున్నారు.
కాగా ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా పుతిన్ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మోదీ గొప్ప దేశభక్తుడని అభివర్ణించారు. మోడీ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్ మరింత పురోగతి సాధించిందని పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్ గర్వించాలన్నారు. భవిష్యత్తు భారత్‌దే అని పుతిన్ తేల్చిచెప్పడం గమనార్హం.
కాగా, వచ్చే వారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులపై పుతిన్ ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కాగా నవంబరు 7–8 తేదీల్లో జైశంకర్ రష్యా రాజధాని నగరం మాస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు అనేక అంశాలపై చర్చలు జరపనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.