Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ లో రష్యన్ రూబుల్ రుబాబు
By: Tupaki Desk | 1 May 2022 11:30 AM GMT2014లో ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాను కలిపేసుకుంది.. డాన్ బాస్ ప్రాంతంలో ఇప్పటికీ తన మద్దతుదారులైన తిరుగుబాటుదారులతో హవా చెలాయిస్తోంది. అది చాలదన్నట్లు మొత్తం ఉక్రెయిన్ పై ఏకంగా రెండు నెలల కిందట దండెత్తింది. సైనిక చర్య పేరు చెప్పి సర్వ నాశనం చేస్తోంది. ఇదీ రష్యా తీరు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది.
వాటిలో మారియుపోల్, ఖెర్సన్ నగరాలు కొన్ని. మారియుపోల్ తీర ప్రాంత పారిశ్రామిక నగరం. ఇక ఖెర్సన్ కీలక ప్రాంతంలో ఉంది. ఇలాంటి ఆక్రమిత ప్రాంతాల్లో బ్యాంక్ వ్యవస్థను విలీనం చేసుకోవడానికి రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఖెర్సన్ లో రష్యా తన కరెన్సీ రూబుల్ ను ప్రవేశపెట్టింది. ఈ నగరంలో ఉక్రెయిన్ కరెన్సీ హ్రైవ్నియా కూడా చలామణిలో ఉంది.
ఈ నగరం నుంచి 40 శాతం మంది ప్రజలు వలసపోగా.. మిగిలిన వారు ఏదో ఒక కరెన్సీ అమల్లో ఉంటే కొంత స్థిరత్వం వస్తుందని భావిస్తున్నారు. అయితే, నగర వాసులు కొందరికి రష్యా కరెన్సీలో పింఛన్లు ఇవ్వడంతో వారు వాటిని స్థానికంగా అందుబాటులో ఉన్న హ్రైవ్నియాల్లోకి మార్చి వాడుకొంటున్నారు. ఈ గందరగోళంతో అక్కడ చెల్లింపులు కష్టమవుతున్నాయి.
మేయర్ ను వెళ్లగొట్టి.. తాము ఆక్రమించిన ప్రాంతాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను రష్యా పదవీచ్యుతులను చేస్తోంది. ఇలా ఖెర్సన్ మేయర్ ఇగోర్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాయి. మారియుపోల్ లోనూ ఇలానే చేశాయి. అయితే, ఖెర్సన్ లో కరెన్సీ సమస్య కారణంగా రెండు నెలల నుంచి సూపర్ మార్కెట్లు ఖాళీగా ఉన్నాయి. రెస్టారెంట్లు, దుకాణాలు మూతపడ్డాయి.కాగా, ఖెర్సన్ లో పూర్తి స్థాయిలో రూబుల్ చెలామణీపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఉక్రెయిన్ బ్యాంకింగ్ వ్యవస్థను రీ ప్లేస్ చేస్తూ రూబుల్ వస్తేనే ఇది సాధ్యం. ఇక పూర్తగి రూబుల్ వస్తే.. ఖెర్సన్ పూర్తిగా సోవియట్ యూనియన్ హయాం (1992కి ముందు) నాటికి వెళ్తుంది.
ప్రజాభిప్రాయ సేకరణతో.. ఉక్రెయిన్ లో చెరబట్టిన ప్రాంతాల్లో రష్యా రెఫరెండం నిర్వహిస్తోంది. ఖెర్సన్ లో త్వరలో ఇలానే చేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అధికారికంగా విలీనం చేసుకోవడానికే ఇలా చేస్తుందని భావిస్తోంది. 2014లో క్రిమియాను ఆక్రమించుకొన్న తర్వాత కూడా రెఫరెండం నిర్వహించారు. ఇటీవల డొనెట్స్క్, లుహాన్స్క్‌ల్లో రెఫరెండం పూర్తి చేశారు. ఖెర్సాన్ నుంచి ఉక్రెయిన్‌లోకి వెళ్లే మార్గాలను రష్యన్ సైన్యం మూసివేసింది. క్రిమియాలోకి వెళ్లేందుకే మాత్రమే రోడ్డు మార్గం తెరిచి ఉంది.
రూబుల్ బలంపై ఫలిస్తున్న పుతిన్ ప్రయత్నాలు ఉక్రెయిన్ పై రష్యా బాంబులతో విరుచుకుపడుతుంటే.. రష్యాను పాశ్చాత్య దేశాలు ఆంక్షలతో వెంటాడుతున్నాయి. దీంతో రూబుల్ విలువ పడిపోయే ప్రమాదం నెలకొంది. ఇలా జరగకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఏప్రిల్ 6న రుణదాతలకు డాలర్లలోనే చెల్లిస్తామని రష్యా వెల్లడించింది. దీంతో.. శుక్రవారం రూబుల్ విలువ డాలర్‌తో పోలిస్తే రెండేళ్ల అత్యధికానికి చేరింది.
కాగా, ఈ ఏడాది 565 మిలియన్ డాలర్లు విలువైన యూరోబాండ్లకు, 2024న మెచ్యూరిటీ తేదీ ఉన్న మరో 84 మిలియన్ డాలర్ల బాండ్లకు సంబంధించిన చెల్లింపులను డాలర్లలోనే చేశామని రష్యా ఆర్థిక శాఖ ప్రకటించింది. కాకపోతే ఈ చెల్లింపులు 30 రోజుల గ్రేస్ పిరియడ్‌లో చేసినట్లు సమాచారం. అయితే, ఆంక్షలు విధించగానే ఆర్థిక శాఖ కీలక చర్యలు చేపట్టింది. వడ్డీ రేట్లను పెంచడం, రష్యన్ బ్రోకర్లు రూబుల్స్ విక్రయాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు గ్యాస్-చమురు చెల్లింపులు రూబుల్స్‌లో చేసేలా చర్యలు తీసుకుంది.