Begin typing your search above and press return to search.

పూర్తిగా నేలమట్టమైపోయిందా ?

By:  Tupaki Desk   |   8 May 2022 3:29 AM GMT
పూర్తిగా నేలమట్టమైపోయిందా ?
X
రష్యా యుద్ధంలో మేరియుపోల్ నగరం పూర్తిగా నేలమట్టమైపోయిందా ? అవుననే అంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. లండన్లో అంతర్జాతీయ వ్యవహారాలపైన జరిగిన ఓ కార్యక్రమంలో జెలెన్ స్కీ మాట్లాడుతు రష్యా దాడిలో మేరియుపోల్ నగర పూర్తిగా ద్వంసమైపోయిందని అంగీకరించారు. నగరం మొత్తం నేలమట్టమైపోయినా నూరుశాతం నగరంపై రష్యా సైన్యం ఆధిపత్యం సంపాదించలేకపోయిందన్నారు.

నిజానికి నగరంలో స్వాధీనం చేసుకోవటానికి ప్రత్యేకంగా ఏమీ లేదని, శిధిలాలు తప్ప పెద్దగా జనాభా కూడా ఎవరూ లేరన్నారు. ఇపుడక్కడ మిగిలింది ఒక్క స్టీలు ప్లాంటు మాత్రమే అని అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు. యుద్ధం మొదలైన దగ్గర నుండి మేరియుపోల్ పై ఆధిపత్యం కోసం రష్యా సైన్యం శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. అయితే యుద్ధం మొదలైన సుమారు 20 రోజుల తర్వాత కానీ నగరంలోకి రష్యా సైన్యం అడుగు పెట్టలేకపోయింది.

ఉక్రెయిన్ కు మరియు పోల్ నగరం చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది పోర్టు సిటి కాబట్టి సముద్ర మార్గానికి ఇక్కడినుండే రూటు మొదలవుతుంది. విదేశాలతో సముద్ర మార్గంలో రాకపోకలకు ఈ నగరం అత్యంత కీలకమైనది. అందుకనే ఈ పోర్టు సిటీని పట్టుకుంటే ముందు వ్యాపారాలను దెబ్బకొట్టచ్చని రష్యా సైన్యం భావించింది. అందుకనే విపరీతంగా పోరాడి యుద్ధ విమానాల ద్వారా బాంబులు కురిపించి నగరంలో చాలా ప్రాంతాలను ధ్వంసం చేసింది.

నగరంలో చాలా భాగం ధ్వంసం అయిపోయిన తర్వాత ఉక్రెయిన్ సైన్యం గట్టిగా ప్రతిఘటించలేకపోయింది. ముందు వైమానిక దాడులు తర్వాత రష్యా ఆర్మీ ఒకేసారి మేరియుపోల్ లోకి ఎంటరయ్యాయి. అప్పటినుండి రష్యా సైన్యం నగరంలో చేయని అరాచకం లేదు, చేయని విధ్వంసం లేదు. మేరియుపోల్ లో మిగిలిన స్టీల్ ప్లాంట్ లో కొందరు ఉక్రెయిన్ సైనికులు, సుమారు 300 మంది సాధారణ పైరులున్నట్లు సమాచారం. అందుకనే నగరంపై రష్యా సైన్యం దాడులు వెంటనే ఆపేయాలని జెలెన్ స్కీ మొత్తుకుంటున్నారు. మరి రష్యా సైన్యం ఏమి చేస్తుందో చూడాల్సిందే.