Begin typing your search above and press return to search.
#RussiaUkrainewar: ఉక్రెయిన్ లో సగభాగాన్ని ఆక్రమించిన రష్యా
By: Tupaki Desk | 24 Feb 2022 12:30 PM GMTఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా దేశం సగభాగాన్ని ఆక్రమించేసింది. ఉక్రెయిన్ పై క్షిపణులు, బాంబులతో దాడి చేసింది. ఇప్పటికే రష్యా చర్యలతో ఉక్రెయిన్ దేశంలో ఎమెర్జెన్సీ విధించింది. ఆ తర్వాతే సీన్ మొత్తం మారిపోయింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పోరాడలేకపోతోంది. ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు అండగా ఉంటున్నాయి. ఈ మద్దతు పై రష్యా ఇంకా మండిపడుతోంది. అందుకే వేగంగా సైన్యాన్ని పంపి ఆక్రమిస్తోంది.
మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ ను చుట్టుముట్టింది రష్యా.. బెలారస్, క్రీమియా, లుహాన్స్ అండ్ డొనెట్స్ నుంచి ఉక్రెయిన్ లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఒకేసారి ముప్పేట దాడికి దిగాయి. త్రివిధ దళాలతో రష్యా బాంబుల మోత మోగిస్తోంది.
ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను రష్యా టార్గెట్ చేసింది. రాజధాని కీవ్ తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ తోపాటు దేశంలోని 6 ప్రధాన ఎయిర్ పోర్ట్స్ ను రష్యా టార్గెట్ చేసింది. రష్యా ప్రధాన టార్గెట్ గా ఆర్టిలరీ పార్క్ ఉంది. అమెరికాకు పెంటగాన్ మాదిరిగా.. ఉక్రెయిన్ ఆయుధగారం ఇక్కడే ఉంది. ఈ ఆర్టిలరీ పార్క్ పై దాడి చేయడమే లక్ష్యంగా రష్యన్ బలగాలు ముందుకు కదులుతున్నాయి.
కేవలం ఐదే ఐదు గంటల్లో సగం ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకుంది రష్యా. మిలటరీ ఆపరేషన్ మొదలుపెట్టిన ఐదారు గంటల్లోనే సగం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి రష్యా తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తోపాటు ఖార్కివ్, ఒడెస్సా, జాపోరియాజియా, దీప్పర్, లుహాన్స్ , డొనెట్స్ ను ఆధీనంలోకి తీసుకుంది.
మిగతా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు బాంబుల మోత మోగిస్తోంది. ఉక్రెయిన్ లోని 11 ప్రధాన ప్రాంతాల్లో రష్యా ఈ దాడి చేస్తోంది.
ఇక రాజధాని కీవ్ లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని.. అందుకే పశ్చిమ సరిహధ్దు ప్రాంతంలో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని భారత ప్రభుత్వం సూచించింది.