Begin typing your search above and press return to search.

పోలీసుల చేతుల్లో శబరిమల.. రంజన్ గొగొయ్ ఏం చెప్పబోతున్నాడంటే ?

By:  Tupaki Desk   |   13 Nov 2019 8:32 AM GMT
పోలీసుల చేతుల్లో శబరిమల..  రంజన్ గొగొయ్ ఏం చెప్పబోతున్నాడంటే ?
X
తాజాగా గత నాలుగు శతాబ్దాలు గా చిక్కు వీడని పీటముడి లా ఉన్న చారిత్రాత్మకమైన అయోధ్య లోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం పై దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనితో ఇక అందరి దృష్టి అంతే చారిత్రాత్మకమైన శబరిమల పై నిలిచింది. గత ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయం లోకి మహిళ కి కూడా ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దీనితో దేశ వ్యాప్తం గా చాలా అవాంఛనీయ ఘటనలు జరిగాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ ఏకంగా 65 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ ఒకే కేసు గా మలిచి సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సారథ్యం లోని ధర్మాసనం.. తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.

ఈ నెల 17వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యం లో ..ఈ శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయోధ్య భూవివాదం పై హిందువుల కు అనుకూలంగా తీర్పు వెలువడినందున.. శబరిమలపై కూడా సానుకూల తీర్పు ఉంటుందనే అంచనాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. అలాగే తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా కూడా అందరూ స్వాగతించాలి ప్రభుత్వం చెప్తుంది. అలాగే తుది తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన భద్రత ని ఏర్పాటు చేసింది.

అయిదు దశల్లో 10,017 మంది పోలీసులను భద్రత కోసం మోహరింపజేస్తామని, ఈ నెల 15వ తేదీ నుంచి భద్రతా చర్యలు తీసుకుంటామని అన్నారు. 24 మంది పోలీసు సూపరింటెండెంట్లు, సహాయ ఎస్పీలు, 112 డిప్యూటీ ఎస్పీలు, 264 మంది ఇన్ స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్ స్పెక్టర్లను ఇందు లో భాగ స్వామ్యులను చేసినట్లు కేరళ పోలీస్ డైరెక్టర్ జనరల్ లోక్ నాథ్ బెహరా తెలిపారు. అలాగే ఈ నెల 17వ తేదీ నుంచి మండల మకర విళక్కు ఉత్సవాలు ప్రారంభమౌతాయని ట్రావెన్ కూర్ దేవస్వోం బోర్డు వెల్లడించింది. అయ్యప్ప స్వామి మాలను ధరించిన భక్తులు దశల వారీగా శబరిమల కు వెళ్లడం 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అదే సమయం లో సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువడబోతున్నందున కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. భక్తుల ముసుగు లో ఎవరైనా ఆలయం లోకి ప్రవేశించవచ్చు అనే అనుమానం తో భద్రత ని భారీ గా పెంచింది.