Begin typing your search above and press return to search.

శ‌బ‌రిమ‌ల ఆల‌య సంప్ర‌దాయాలు అక్క‌ర్లేదా?

By:  Tupaki Desk   |   7 Oct 2018 11:48 AM GMT
శ‌బ‌రిమ‌ల ఆల‌య సంప్ర‌దాయాలు అక్క‌ర్లేదా?
X
ప్ర‌ముఖ పుణ్య‌క్షేత‌మైన శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌వేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచ‌ల‌న తీర్పుపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. సుప్రీంతీర్పును త‌ప్పు ప‌డుతూ సోష‌ల్ మీడియాలో భారీగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం తీర్పును సామాన్యులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సుప్రీం తీర్పుపై గ‌త ఆదివారం పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది.

కేర‌ళ‌లోని ప‌లుప్రాంతాల‌కు చెందిన మ‌హిళ‌లు వేలాదిగా రోడ్ల మీద‌కు వ‌చ్చి స్వ‌చ్చందంగా నిర‌స‌న‌లు చేప్ట‌టం.. ప్ర‌భుత్వం ఈ అంశంపై రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌న్న డిమాండ్‌ను తెర మీద‌కు తెచ్చారు. తాజాగా ఈ అంశంపై శ‌బ‌రిమ‌ల దేవాల‌యం సీనియ‌ర్ పూజారి మోహ‌నారు కండ‌రావు మాట్లాడారు. సుప్రీం తీర్పున‌కు వ్య‌తిరేకంగా ముందు రాష్ట్ర ప్ర‌భుత్వం రివ్యూ పిటీష‌న్ వేయాల‌న్నారు. సంప్ర‌దాయాల‌కువిరుద్దంగా తీర్పు ఉంద‌ని.. దీన్ని తాము స‌మ్మ‌తి లేద‌న్నారు.

సుప్రీం తీర్పు ఆల‌య సంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా ఉంద‌ని.. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి స‌రికాద‌న్నారు. అన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌ల్ని ఆల‌యంలోకి అనుమ‌తిస్తే.. యుక్త వ‌య‌సులో ఉన్న అమ్మాయిలు.. రుతుక్ర‌మం వ‌చ్చే స్త్రీలు కూడా రావొచ్చ‌ని.. అదే జ‌రిగితే ఆల‌య సంప్ర‌దాయానికి.. స‌న్నిధి ఆచారాలు దెబ్బ తింటాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

శ‌బ‌రిమ‌ల‌లో 600 మంది మ‌హిళా పోలీసుల్ని నియ‌మిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించటం స‌రికాదంటున్నారు. ఈ మ‌ధ్య‌న జ‌రుగుతున్న అన్ని ప‌రిణామాలు ఆల‌య సంస్కృతికి విరుద్ధంగా సాగుతున్న‌వేన‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని గుర్తించి కోర్టులో రివ్యూ పిటీష‌న్ దాఖ‌లు చేయాల‌ని వారు కోరుతున్నారు. ఈ అంశంపై ప్ర‌జాభిప్రాయాన్ని నిర్వ‌హించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు తెర తీస్తున్న ఈ ఉదంతంపై ప్ర‌భుత్వం స‌కాలంలో నిర్ణ‌యం తీసుకోకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఆచార వ్య‌వ‌హారాలు.. ప్ర‌జ‌ల సెంటిమెంట్ల విష‌యంలో ప్ర‌భుత్వాలు.. న్యాయ‌స్థానాలు క‌ర‌కుగా వ్య‌వ‌హ‌రించ‌టం స‌రి కాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.